డెన్మార్క్ ఓపెన్ లో సింధూ విజయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డెన్మార్క్ ఓపెన్ లో సింధూ విజయం

న్యూఢిల్లీ, అక్టోబరు 15  (way2newstv.com)
వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తర్వాత భారీ అంచనాల నడుమ డెన్మార్క్ ఓపెన్‌లో అడుగుపెట్టిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. తొలి మ్యాచ్‌లోనే ఘన విజయాన్ని అందుకుంది. ఒడెన్స్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇండోనేసియాకి చెందిన గ్రెగొరియా మరిస్కాతో మంగళవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఢీకొట్టిన పీవీ సింధు 22-20, 21-18 తేడాతో అలవోకగా గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.ఈ మ్యాచ్‌ ముందు వరకూ మరిస్కాపై 4-0తో గెలుపు రికార్డ్‌లో ఉన్న పీవీ సింధు.. మ్యాచ్ ఆరంభం నుంచే తన ఆధిపత్యాన్ని చెలాయించింది. 
డెన్మార్క్ ఓపెన్ లో సింధూ విజయం

అయితే.. ఆరంభంలో కాస్త తడబడిన మరిస్కా.. మధ్యలో పుంజుకుంది. కానీ.. అప్పటికే జోరందుకున్న పీవీ సింధు 22-20 తేడాతో తొలి సెట్‌ని చేజిక్కించుకుంది. ఇక రెండో సెట్‌లో కూడా సింధూకి మరిస్కా పోటీనిచ్చినా మ్యాచ్‌ని మాత్రం గెలవలేకపోయింది. దీంతో.. తాజా విజయంతో మరిస్కాపై గెలుపు రికార్డ్‌ని 5-0తో సింధు మెరుగుపర్చుకుంది.పురుషుల సింగిల్స్‌లో భారత సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. థాయ్‌లాండ్‌కి చెందిన థామ్సిన్‌పై 21-13, 21-12 తేడాతో వరుస సెట్లలో అతను విజయాన్ని అందుకున్నాడు. పీవీ సింధు 38 నిమిషాల్లో మ్యాచ్‌ని ముగించగా.. కశ్యప్‌ కూడా సరిగ్గా 38 నిమిషాల సమయమే తీసుకోవడం విశేషం.