2 వేల నోటు ఆగిపోయింది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

2 వేల నోటు ఆగిపోయింది

ముంబై, అక్టోబరు 16 (way2newstv.com):
రూ.2,000 నోట్ల ఎక్కువగా ఇంట్లో దాచేస్తున్నారా? అయితే జాగ్రత్త. రూ.2 వేల నోట్ల ముద్రణ ఆగిపోయింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక్క అధిక విలువ కలిగిన నోటును ముద్రించలేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ విధంగా సమాధానమిచ్చింది.మోదీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్‌లో కొత్త రూ.500 నోట్లతోపాటు రూ.2,000 నోట్లు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. నల్లధనాన్ని వెలికి తీసేందుకు, నకిలీ నోట్ల చెలామణిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,000 నోట్లను, రూ.500 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.
2 వేల నోటు ఆగిపోయింది

2016-17 ఆర్థిక సంవత్సరంలో 354.29 కోట్ల రూ.2,000 నోట్లను ముద్రించామని ఆర్‌బీఐ ఆర్‌టీఐ రిప్లేలో తెలియజేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 11.15 కోట్ల నోట్లను, 2018-19లో 4.6 కోట్ల నోట్లను ముద్రించినట్లు న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక నివేదికలో పేర్కొంది.పెద్ద నోట్ల కారణంగా కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. స్మగ్లింగ్, ఇతర చట్టవిరుద్ధమైన పనులను రూ.2,000 నోట్ల రూపంలో ఎక్కువగా జరగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దులో రూ.6 కోట్లు లెక్కలులేని నగదు రూ.2,000 నోట్ల రూపంలో సీజ్ అయిన విషయం తెలిసిందే.ఆర్‌బీఐ డేటా కూడా రూ.2,000 నోట్ల చెలామణి తగ్గుతున్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. 2018 మార్చి చివరి నాటికి 336.3 కోట్ల నోట్లు సర్కులేషన్‌లో ఉండేవి. 2019 ఆర్థిక సంవత్సరంలో నోట్ల చెలామని 329.1 కోట్లకు తగ్గింది. అంటే రూ.2,000 నోట్లు ఎక్కడో బ్లాక్ అవుతున్నాయి.అలాగే గత మూడేళ్లలో కేంద్రం ఏకంగా రూ.50 కోట్లకు పైగా ఫేక్ కరెన్సీ నోట్లు సీజ్ చేసింది.