ట్రాక్టర్ల కొనుగోలు పారదర్శకంగా ఉండాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ట్రాక్టర్ల కొనుగోలు పారదర్శకంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
వనపర్తి అక్టోబర్ 16 (way2newstv.com):
గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల కొనుగోలు పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె తన ఛాంబర్లో గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల కొనుగోలు విషయమై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాక్టర్ల కొనుగోలు ఏలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా కొనుగోలు చేయాలని, ఇందుకుగాను జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. 
ట్రాక్టర్ల కొనుగోలు పారదర్శకంగా ఉండాలి


ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్ చైర్మన్గా, డి పి ఓ, డి ఆర్ డి ఓ, డి ఎ ఓ, ఇంజనీరింగ్, ఇండస్ట్రీస్ అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు.  ట్రాక్టర్ల కొనుగోలుకు ముందుగానే జిల్లాస్థాయి కమిటీ కంపెనీలను, వారు ఉత్పత్తి చేస్తున్న ట్రాక్టర్లు, విడిభాగాల అందుబాటు, సర్వీస్ సిస్టం, ధరలు, నాణ్యత, గ్యారంటీ తదితర అన్ని అంశాలను క్షుణ్నంగా తనిఖీ చేసిన మీదటే కంపెనీలను నిర్ణయించాలని కలెక్టర్ ఆదేశించారు. ట్రాక్టర్ల కొనుగోలు విషయంపై మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.  జాయింట్ కలెక్టర్ డి. వేణుగోపాల్, డి పి ఓ రాజేశ్వరి, డి ఆర్ డి ఓ గణేష్, పంచాయతీరాజ్ ఈ ఈ శివ కుమార్, ఇండస్ట్రీస్ అధికారి నరేష్ కుమార్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.