హైద్రాబాద్, అక్టోబరు 2, (way2newstv.com)
వ్యాయామం ఏదైనా సరే ఒత్తిడిని దూరం చేయాలే తప్ప మరింత ఒత్తిడికి గురి చేయకూడదు. యోగ సాధన చేసేవాళ్లు... పూర్తి రిలాక్స్‌డ్‌గా ఉన్నప్పుడే ఆసనాలు రీచార్జ్ సాధనాలుగామారతాయి. శారీరక దృఢత్వానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే రుషులు, మునులు అందించిన హఠయోగం శాస్త్రం కాబట్టి శాస్త్రీయ దృక్పథంతోనే ఆచరించాలి. రైతు పొలందున్నేటప్పుడు కాడికి కుడి ఎడమ వైపున కట్టిన ఎడ్ల కదలికలో సమతుల్యం ఉండేటట్టుగా ఎలా చూస్తాడో అలాగే యోగాసన, ప్రాణాయామ సాధన చేసేటప్పుడు శరీరంలో ఎడమ, కుడిభాగాలను మెదడులో ఎడమ, కుడి గోళార్ధములను, ఇడ–పింగళ నాడులను సమంగా పనిచేసేటట్టుగా చూడాలి.
వ్యాయామంతో రీఫ్రెష్...
అన్ని ఆసనాలు చాలా తేలికగా శ్రమలేకుండా, చెమటోడ్చకుండాతక్కువ సమయంలో పూర్తి చేసి, ఎక్కువ సమయాన్ని ధ్యానంలో గడిపే విధానాన్ని యోగులు అనుసరిస్తారు. రోగాల నుంచి ఉపశమనం కొరకు కొన్ని ఆసనాల సాధన రోగులుపాటిస్తున్నారు. ఇక భోగులు చేసే యోగా ఇప్పుడు సిటీలో అధికంగా కనపడుతోంది. వీరు విలాసవంతంగా తిరగడానికి వారాంతపు వేడుకలకి అవసరమైన శారీరక పటుత్వం కోసంయోగా సాధన చేస్తున్నారు. అయితే యోగా మన జీవనశైలిని కూడా మార్చాలి. ఆహారం, విహారం, వ్యవహారం అన్ని సమన్వయం చేస్తూ యోగ సాధన చేస్తేనే సంపూర్ణ ఫలం. న్యూక్లియర్ ఫ్యామిలీలు, కెరీర్ ఆరాటాల వల్ల నగరంలో మానసిక ఒత్తిడి ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఒత్తిడిలో ఉన్నప్పుడు ముందుగా తలలోని భాగాలు, మెడ, భుజాలు బాగా ప్రభావితమవుతాయి. కనుక వీటికి సంబంధించిన బ్రహ్మముద్రలు, చాలన తాలాసన, ఉత్థాన హస్తపాదాసన. మార్జాలాసన, అర్థ అధోముఖ, అధోముఖ శ్వానాసన, నిరాలంబాసన,ఉదరాకర్షణాసన, మకరాసన, శశాంకాసన.. వంటి తేలికపాటి ఆసనాలు రెగ్యులర్‌గా సాధన చేయడం ఉపకరిస్తుంది. ఆధునిక శాస్త్రం నెర్వ్ సెంటర్స్ లేదా నాడీ కేంద్రాలు అంటోంది).ఈమూల సూత్రాన్ని అనుసరించి ఆసనాలు నిలబడి చేసేవి, కూర్చుని చేసేవి, పొట్ట మీద పడుకుని చేసేవి, వీపు మీద పడుకుని చేసేవి. తలకిందులుగా చేసేవి... ఈ 5 రకాల ఆసనాల శైలివిభిన్న ప్రయోజనాలు అందిస్తుంది.
Tags:
telangananews