త్వరలో కేసీఆర్ కారాలు, మషాలాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

త్వరలో కేసీఆర్ కారాలు, మషాలాలు

మెదక్, అక్టోబరు 2, (way2newstv.com)
త్వరలో మార్కెట్లోకి కేసీఆర్ కారం, కేసీఆర్ మసాలాలు రానున్నాయి! ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతున్నాయని భావిస్తున్న ప్రభుత్వం.. వాటిని అరి కట్టేందుకు దగ్గరుండి ఆహార పదార్థాలను తయారు చేయించేందుకు సిద్ధమైంది. సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ముందుగా కారం, మసాలాలను ఉత్పత్తి చేసి మార్కెట్ లోకివిడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు. వీటికి కేసీఆర్ పేరును పెట్టే ఆలోచనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది.కల్తీ పదార్థాలను అరికట్టాలంటే ప్రభుత్వమే ఫుడ్ ప్రాసెసింగ్చేయాలని చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇటీవల అసెంబ్లీ లో బడ్జెట్పై చర్చ సమయం లోనూ.. కల్తీ  ఆహార ఉత్పత్తులపై ఆయన  మాట్లాడారు. కల్తీ ఉత్పత్తుల వల్ల హైదరాబాద్ ఇమేజీ  దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. 
త్వరలో కేసీఆర్ కారాలు, మషాలాలు

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ కోసం ఒక కార్యాచరణ తయారు చేయాలని మూడు నెలల క్రితం అధికారులను సీఎం  ఆదేశించారు.ఈ క్రమంలో ఐకేపీ మహిళా సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేయించాలని అధికారులు యోచిస్తున్నారు. రాష్ట్రంలో 4 లక్షల ఐకేపీ మహిళా సంఘాలు ఉన్నాయి. ఇందులో 45 లక్షలమంది సభ్యులున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించిన అధికారులు త్వరలో కారం, మసాలాలను మహిళా సంఘాలతో తయారు చేయించేందుకుఏర్పాట్లు చేస్తున్నారు.పైలట్ ప్రాజెక్టుగా మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని మహిళా గ్రూపులతో కారం, మసాలాలను తయారు చేయించాలని అధికారులు భావిస్తున్నారు. మిరపకాయలు,పసుపు, ధనియాలను సీజన్ లో సేకరించి మహిళా సంఘాలకు సరఫరా చేయనున్నారు. ఈ లోపు వారికి శిక్షణ ఇస్తామని వ్యవసాయ శాఖలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు. వారు ప్రాసెసింగ్ చేసిన ఉత్పత్తులను వచ్చే ఏడాదిలో మార్కెట్ లోకి విడుదల చేస్తామన్నారు. ఉత్పత్తులకు కేసీఆర్ పేరు పెడితే బాగుంటుందని ఆలోచన ఉందని ఆయన చెప్పారు.