వైరల్ అవుతున్న వెయ్యి నోటు ఫేక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైరల్ అవుతున్న వెయ్యి నోటు ఫేక్

వెయ్యి నోటును తిరిగి తీసుకొచ్చే ఆలోచన లేదు:ఆర్బిఐ
హైదరాబాద్  అక్టోబర్ 19 (way2newstv.com)
ఇటీవల ఒక కొత్త వెయ్యి నోటు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ ఖాతాల్లోనూ వైరల్ గా మారింది. త్వరలో వెయ్యి నోటును తీసుకొచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు సాగుతున్నాయంటూ ఒక డమ్మీ నోటును శాంపిల్ గా చూపిస్తూ వైరల్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో రూ.2వేల నోటు ముద్రణ ఆపేసిన నేపథ్యంలో.. ఏ క్షణంలో అయినా రూ.2వేల నోటును రద్దు చేసే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న వేళ.. దాని స్థానే వెయ్యిరూపాయిల నోటును తీసుకొస్తారా? అన్నది సందేహంగా మారింది.
వైరల్ అవుతున్న వెయ్యి నోటు ఫేక్

అయితే.. ఇలాంటివన్నీ ఉత్తుత్తి ప్రచారాలుగా తేల్చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తాజాగా వెయ్యి నోటు మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. వైరల్ అవుతున్న వెయ్యి నోటు ఫేక్ అని తేల్చేయటమే కాదు.. వెయ్యి నోటును ముద్రిస్తున్న వైనం కూడా తప్పేనని స్పష్టం చేసింది. వెయ్యి నోటును తిరిగి తీసుకొచ్చే ఆలోచన ఇప్పటివరకూ ఏమీ లేదని తేల్చేసింది.పెద్దనోట్ల రద్దులో భాగంగా రూ.వెయ్యి.. రూ.500 నోట్లు చెల్లవని తేల్చేసిన మోడీ సర్కారు.. వెయ్యి నోటుకు శాశ్వితంగా మంగళం పాడేసిన వైనం తెలిసిందే. మోడీ పవర్లోకి వచ్చిన తర్వాత కూడా అమల్లో ఉన్న వెయ్యి నోటును తీసిపారేసి..దానిస్థానే రూ.2వేల నోటును తీసుకురావటం తెలిసిందే. వెయ్యికి బదులుగా రూ.2వేల నోటును తర్వాతి కాలంలో రూ.200 నోటును తీసుకొచ్చారే తప్పించి వెయ్యి నోటును తిరిగి తీసుకురాలేదు.