ప్రైవేటుతోనే ప్రయాణం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రైవేటుతోనే ప్రయాణం

హైద్రాబాద్, అక్టోబరు 4, (way2newstv.com)
సరా పండుగకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇవ్వాళ జేఏసీ నేతలతో కార్మికుల సమస్యలపై చర్చలు సఫలం కాలేదు.దీంతో కార్మిక నేతలు సమ్మెవైపు మొగ్గుచూపారు. ఏది ఏమైనా సమ్మె యథాతథంగా నడుస్తుందని జేఏసీ చెబుతోంది. పండగ దృష్ట్యా సమ్మెను విరమించుకోవాలని అధికారులుచెప్పినప్పటికీ జేఏసీ నేతలు అంగీకరించడం లేదు.
ప్రైవేటుతోనే ప్రయాణం

పండగ సమయంలో నిత్యం సుమారు రెండు లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ, దిల్సుఖ్ నగర్, కూకట్ పల్లి, బి.హెచ్.ఇ.ఎల్ తదితర ప్రాంతాల నుంచి వివిధ జిల్లాలకు వెళ్తుంటారు. ఇందుకోసం ఆర్టీసీ రెగ్యులర్ బస్సులతో పాటు పండగ సమయాల్లో అదనపు బస్సులనుసైతం నడుపుతుంటుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడంతో ఇప్పుడు రెగ్యులర్ బస్సులు నడిచే పరిస్థితి కూడా కష్టమైంది. దీంతో ప్రభుత్వం నియమించిన కమిటీరవాణాశాఖకు దిశానిర్ధేశం చేసింది.ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలికంగా తీసుకుని బస్సులను నడిపించాలని సూచించారు. దీంతో పాటు కళాశాలలు, పాఠశాలలకు చెందిన ప్రైవేటుబస్సులను కూడా ఈ పండగ సమయంలో ఉపయోగించి ప్రయాణికుల గమ్యస్థానాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ప్రైవేటుతాత్కాలిక డ్రైవర్ కు రోజుకు రూ.1500, కండక్టర్ కు రోజుకు రూ.1000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని సూచించింది  కమిటీ