ఆవిషయాన్ని వెంకటేశ్వర రావునే అడగండి: పురందేశ్వరి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆవిషయాన్ని వెంకటేశ్వర రావునే అడగండి: పురందేశ్వరి

ఏలూరు అక్టోబర్ 29 (way2newstv.com)
వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి, బీజేపీ మహిళా నేత పురందేశ్వరిని పార్టీలోకి తీసుకురావాలని ఆయన్ను అధిష్టానం ఆదేశించినట్లు పెద్దఎత్తున వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే ఈ చేరిక వ్యవహారంపై కొద్దిరోజులుగా ప్రకాశం జిల్లాలో హాట్ హాట్‌గా సమావేశాలు జరగడం.. అదికాస్త దగ్గుబాటి రాజీనామా దాకా వెళ్లింది.! అయితే వైసీపీలో చేరాలన్నా ఒత్తిడిపై పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన పురందేశ్వరి ఫస్ట్ టైం ఈ వ్యవహారంపై స్పందించారు.
ఆవిషయాన్ని వెంకటేశ్వర రావునే అడగండి: పురందేశ్వరి

‘ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాలని ఆహ్వానం వచ్చింది. ఇప్పుడు నాకు ఎటువంటి ఆహ్వానం రాలేదు. వైసీపీలో చేరడానికి ముందు నా భర్త (దగ్గుబాటి వెంకటేశ్వరరావు).. నేను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టంగా ఆ పార్టీ నేతలకు చెప్పారు. అందుకు వైసీపీ నేతలు అంగీకరించిన తరువాతే నా భర్త, నా కుమారుడు ఆ పార్టీలో చేరారు. వైసీపీకి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్న విషయాన్ని వెంకటేశ్వరరావును అడగండి’ అని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.