అరవింద్‌ బాబ్డే నియామకంపై రాష్ట్రపతి ఆమోద ముద్ర - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అరవింద్‌ బాబ్డే నియామకంపై రాష్ట్రపతి ఆమోద ముద్ర

న్యూఢిల్లీ అక్టోబర్ 29 (way2newstv.com)
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే నియామకంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ఆమోద ముద్ర వేశారు. నవంబర్‌ 18న ఆయన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 
అరవింద్‌ బాబ్డే నియామకంపై రాష్ట్రపతి ఆమోద ముద్ర

ప్రస్తుతమున్న చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నవంబర్‌ 17వ తేదీన పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఆ లోపే వివాదాస్పద అయోధ్య కేసులో తుది తీర్పు ఇస్తానని రంజన్‌ గొగోయ్‌ ఇంతకుముందే ప్రకటించారు.