కల్కి ఆశ్రమంలో కీలక ప్రతాలు స్వాధీనం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కల్కి ఆశ్రమంలో కీలక ప్రతాలు స్వాధీనం

మూడో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు
తిరుపతి అక్టోబర్ 19 (way2newstv.com)
కల్కి భగవాన్ ఆశ్రమంలో శనివారం కుడా   ఐటీ సోదాలు కొనసాగాయి.  ఈ దాడుల్లో ఇప్పటికే భారీగా అక్రమాస్తులను ఆదాయపు పన్ను అధికారులు గుర్తించారు. కీలక పత్రాలను, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. కల్కి ఆశ్రమం వ్యవస్థాపకులు విజయ్ కుమార్, పద్మావతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 


అధికారులు చేపట్టిన తనిఖీల్లో క్యాంపస్-3లో భారీగా విదేశీ నగదు, బంగారాన్ని గుర్తించినట్లు  సమాచారం. ఈ మేరకు కల్కి భగవాన్ కుమారుడు కృష్ణ నాయుడు, కోడలు ప్రీతినాయుడు, ట్రస్ట్ నిర్వహకుడు లోకేష్ దాసాజీని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. స్వదేశీ, విదేశీ భక్తుల ద్వారా భారీ ఎత్తున విరాళాలు సేకరించి.. వందల ఎకరాలు, కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు నిర్ధారించారు.