కృష్ణా జిల్లాలకు వైభవంగా పూజలు..... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కృష్ణా జిల్లాలకు వైభవంగా పూజలు.....

వనపర్తికి నల్లచెరువు కల్పతరువు...
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి అక్టోబరు 25  (way2newstv.com):
నల్లచెరువు వనపర్తి పట్టణానికి కల్పతరువు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.       శుక్రవారం ఆయన వనపర్తి పట్టణం సమీపంలో ఉన్న నల్లచెరువు అలుగు పారుతున్న దృష్ట్యా కృష్ణా జిల్లాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సంస్థానాల కాలం నుండి నూట అరవై ఎకరాల విస్తీర్ణం కలిగిన నల్ల చెరువు కాలక్రమేణా 50 నుండి 60 ఎకరాలు అన్యాక్రాంత నికి గురై చెరువు పూర్తిగా ధ్వంసం అయ్యే పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోiతల పథకాల ద్వారా చెరువులన్నింటిని నీటితో నింపేందుకు అవకాశం కల్పించగా నల్లచెరువు ను కృష్ణా జలాలతో నింపటం సంతోషదాయకం గా ఉందని అన్నారు. 
కృష్ణా జిల్లాలకు వైభవంగా పూజలు.....

నల్లచెరువు ప్రస్తుతం  పట్టణానికి శోభాయమానంగా నిలిచిందని, చెరువు నీరు పంటపొలాలకు సాగునీరు అందించడంతోపాటు, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఏర్పడిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం నల్లచెరువు పూర్తిస్థాయిలో నిండినందున పట్టణానికి సమీపంలో ఉన్న తాళ్ళచెరువు, ఈదుల చెరువులను కూడా వచ్చే ఖరీఫ్ నాటికి కృష్ణా నీటితో నింపుతామని మంత్రి తెలిపారు. నల్లచెరువు తో పాటు, ఈదుల చెరువు, తాళ్ళచెరువు నిండి నట్లయితే పట్టణంలో ఉన్న మత్స్యకార కుటుంబాలు అందరికీ ఉపాధి దొరుకుతుందని, వ్యవసాయంతో పాటు ఇతర రంగాలు అభివృద్ధి చెందడానికి ఆస్కారముందని అన్నారు. నల్లచెరువు ను నీటితో నింపడం వల్ల చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల వరకు బోర్లు రీఛార్జి అయ్యాయని అన్నారు.        మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు వాకిటి శ్రీధర్, గట్టు యాదవ్, తిరుమల్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.