పోరాటానికి సిద్దం : పవన్ కళ్యాణ్
మంగళగిరి అక్టోబర్ 25 (way2newstv.com):
ఇసుక కొరత ప్రభావం భవన నిర్మాణ కార్మికులపైనే కాకుండా మొత్తం సమాజంపై పడిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇసుక కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీ నలుమూలల నుంచి తరలివచ్చిన ఇసుక లారీల యజమానులు, డ్రైవర్లు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ తో భేటీ అయి తమ కష్టాలను ఏకరువు పెట్టారు. ఏపీలో ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉందన్న పవన్.. వైసీపీ ప్రభుత్వం కొత్త ఇసుక విధానం తెస్తున్నామంటే... మొదట సంబరపడ్డామని..
ఇసుక కొరతను తీర్చాలి
ఆ తర్వాత చూస్తే... సమస్య మరింత జఠిలం అయ్యిందన్నారు. ఇసుక సరఫరా పునరుద్ధరణ జరిగేంతవరకు పోరాటం చేస్తామన్నారు. ఇసుక కొరత వల్ల ఉపాధి పనులు దొరక్క 30 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారన్న పవన్.. రాజధాని నిర్మాణం ఉందో లేదో తెలియక... అక్కడ కూడా నిర్మాణ పనులు ముందుకు సాగట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.అర్ధరాత్రి పూట ఇసుక ఆన్ లైన్ బుకింగ్ ఎందుకు అని ప్రశ్నించారు. ప్రభుత్వ పరిపాలన తీరు బాధ కలిగిస్తోందని, రాజధాని అమరావతిపై వైకాపా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. పది ఉద్యోగాల కోసం పది వేల మంది ఉద్యోగాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నూతనంగా ఉద్యోగ, ఉపాధి కల్పన చేయాలి కా నీ, ఉన్న ఉద్యోగాలను ఊడకొట్టకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు.