రాజమహేంద్రవరం అక్టోబరు 9, (way2newstv.com)
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో జరిగిన ఒక వివాహానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హజరయ్యారు. స్థానిక మంజీర కన్వెన్షన్ లో జరిగిన మాజీ ఏపీ ఐ ఐ సీ చైర్మెన్, వైకాపా నగర కోఆర్డినేటర్ శివరామ సుబ్రాహ్మణ్యం కుమార్తె అమృతవల్లి వివాహ వేడుకల్లో పాల్గొని వధూ వరుల ను ఆశీర్వదించారు.
వైకాపా నేత కూతురి వివాహానికి హజరైన సీఎం జగన్
అమృతవల్లి వివాహం శ్రీరంగనాథ్ తో జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కురసాల కన్నబాబు, విశ్వరూప్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలతో పాటు ఎంపీ భరత్, కాపు కార్పోరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజాతదితరులు కుడా హజరయ్యారు. తరువాత రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుని తిరిగి జగన్ తాడేపల్లికి వెళ్లారు.