తెలంగాణ మద్యం పాలసీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణ మద్యం పాలసీ

భారీ ఆదాయం దిశగా అడుగులు
హైద్రాబాద్, అక్టోబరు 3, (way2newstv.com)
తెలంగాణ ప్రభుత్వం నూతన మద్యం విధానం ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ 31 వరకు నూతన మద్యం విధానం అమల్లో ఉండనుంది. రాష్ట్రంలో 2216 మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో దుకాణాదారుల ఎంపిక జరగనుంది. ప్రభుత్వం ఈసారి జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ఖరారు చేసింది. గతంలో ఉన్న 4 శ్లాబులు ఉండగా.. వాటిని 6 శ్లాబులుగా మార్చింది. తిరిగి ఇవ్వని దరఖాస్తు ఫీజును లక్ష రూపాయల నుంచి రూ.2 లక్షలకు పెంచింది.జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం విక్రయించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇతర ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలు జరగనున్నాయి. 
తెలంగాణ మద్యం పాలసీ

ఈనెల చివరిలోగా లాటరీ విధానం ద్వారా మద్యం లైసెన్సుదారులను ఎంపిక చేస్తారు.ఐదు వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 50 లక్షల లైసెన్స్ ఫీజు, 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ. 55 లక్షలు ఉంటుంది. 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ. 60 లక్షలు, లక్ష జనాభా నుంచి 50 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు లైసెన్స్ ఫీజు రూ. 65 లక్షలు కట్టాల్సి ఉంటుంది. 5 లక్షల నుంచి 20 లక్షల లోపు జనాభా ప్రాంతాలకు రూ. 85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లుగా లైసెన్స్ ఫీజును నిర్ణయించారు.వాస్తవానికి సెప్టెంబర్ చివరితో మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగియాల్సి ఉంది. అక్టోబరు 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రావాల్సింది. కానీ పాత లైసెన్స్‌ల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగిస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది.