తిరుపతి, అక్టోబరు 12, (way2newstv.com)
చిత్తూరు జిల్లాలోని ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తూనే రైతులు లక్షల హెక్టార్లకు చెందిన బీడు భూములను సాగులోకి తీసుకురావాలనే సంకల్పంతో శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే జిల్లాలోని ప్రాజెక్టులకు చెందిన పూర్తి సమాచారాన్ని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. 2006లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో 3.75లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. తద్వారా 7లక్షల మంది రైతులకు ప్రత్యేకంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుందనే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకున్నారు.2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోమశిల–స్వర్ణముఖి పేరుతో 101 కి.మీ మేరకు చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని ఐదు మండలాల్లో సాగునీరు ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు.
జిల్లాల్లో కొనసాగుతున్న రివర్స్ టెండరింగ్
ఈ కాలువ పూర్తి చేయడానికి 6,225 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. 1.23లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. టీడీపీ హ యాంలో సోమశిల–స్వర్ణముఖి కాలువ పేరును ఆల్తూరుపాడు–మేర్లపాకగా మార్పు చేయడంతోపాటు 101 కి.మీ నుంచి 48 కి.మీ కాలువను కుదించారు. కేవలం 1,546 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేశారు. 101 కి.మీ పనులకు అప్పట్లో రూ.362 కోట్లు కేటాయింపులు చేశారు. చంద్రబాబు సర్కార్ 48 కి.మీ రూ.421కోట్లు అంచనా వేశారు. తమ అనుచరులకు 60సీ క్లాజ్ పేరుతో పెద్ద ఎత్తున దోచిపెట్టినట్టు స్పష్టమవుతోంది.నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రూ.680 కోట్ల టెండర్లు రద్దు చేసింది. విజయవాడలో శుక్రవారం సంబంధిత ప్రాజెక్టులపై మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో జలవనరులశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన పలు కీలక అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలంలోని అలూర్తుపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.110 కోట్లు, ఆల్తూరుపాడు లిఫ్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్‌కు రూ.280 కోట్లు, చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామ సమీపంలోని మేర్లపాక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.250 కోట్లు, చంద్రగిరి సమీపంలోని మూలకాలువ వద్ద చేపడుతున్న హంద్రీ–నీవా పనులకు రూ.40కోట్లతో గత ప్రభుత్వం టెండర్లు పిలిచింది. వీటిని దక్కించుకున్న సంబంధిత కాంట్రాక్టర్లు ఇప్పటివరకు 25 శాతం కన్నా తక్కువ పనిచేసినట్లు ఇటీవల నిపుణుల కమిటీ తేల్చింది. దీనికితోడు ఐబీఎం (ఇంటర్నల్ బెంచ్ మార్క్) నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నట్లు గుర్తించింది నివేదిక ప్రభుత్వానికి అందజేశారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించారు. ఆ పనులు రద్దు చేస్తున్నట్లు సదరు కాంట్రాక్టర్లకు నోటీలు అందజేశారు. ఈ నాలుగు పనులకు అవసరాన్ని బట్టి రివర్స్ టెండర్లు చేపట్టనున్నారు