ఎదురు తిరుగుతున్న విమర్శలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎదురు తిరుగుతున్న విమర్శలు

విజయవాడ, అక్టోబరు 29, (way2newstv.com)
వ్యతిరేకత దానంతట అదే రావాలి. పని గట్టుకుని విమర్శిస్తే వ్యతిరేకత రాదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి ఇదే చర్చనీయాంశమయింది. చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్ పై పదే పదే విమర్శలు చేస్తున్నారు. రౌడీ రాజ్యమంటున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటున్నారు. రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తుందని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ నేతలను, క్యాడలర్ ను భయభ్రాంతులకు గురిచేస్తుందని చెబుతు వస్తున్నారుచంద్రబాబు విమర్శలను జగన్ సర్కార్ లైట్ గా తీసుకుంటుంది. ఆయన ఆరోపణలపై ఒకరిద్దరు మంత్రులు మినహా పెద్దగా ఎవరూ స్పందించడ లేదు. 
 ఎదురు తిరుగుతున్న విమర్శలు

ఇది కూడా జగన్ వ్యూహంలో భాగమే నంటున్నారు. వైఎస్ జగన్ కు ఇంకా నాలుగున్నరేళ్లకు పైగానే సమయం ఉంది. అయినా నాలుగు నెలల్లోనే తాను అనుకున్న పథకాలను గ్రౌండ్ చేసే పనిలో పడ్డారు జగన్. పథకాలను పూర్తిగా ప్రజల వద్దకు చేర్చగలిగితే తాను సక్సెస్ అయినట్లే భావిస్తున్నారు. అందుకే జగన్ టీడీపీ ఆరోపణలపై ఏమాత్రం స్పందించకుండా తన పని తాను చేసుకుపోతున్నారు.ఇప్పటికే ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను అమలు చేశారు.చేస్తున్నారు. కొన్ని ఎన్నికల సమయంలో చెప్పని వాటిని కూడా అమలు చేసే పనిలో ఉన్నారు జగన్. వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో జనవరిలో ప్రజలకు అందుబాటులో రానున్నాయి. వాటిని సక్రమంగా పనిచేయించగలిగితే తనకు పాజిటివ్ వేవ్ ఉంటుందని జగన్ భావిస్తున్నారు. అందుకే ప్రతి పథకాన్ని జగన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నం రైతాంగంలో అనుకూలత ఏర్పడతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.రైతు భరోసా కార్యక్రమం కింద ప్రతి రైతుకు 12, 500లు పెట్టుబడి ఇస్తామని చెప్పిన జగన్ తాజాగా దానిని వెయ్యికి పెంచి 13,500లకు పెంచారు. అలాగే లక్షల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించడం వంటి వాటితో జగన్ దూసుకెళుతున్నారు. నాలుగు నెలల్లోనే జగన్ తీసుకున్న నిర్ణయాలను ప్రజలు స్వాగతిస్తున్నారు. దీంతో చంద్రబాబు జగన్ పై ఎన్ని విమర్శలు చేసినా ఇప్పుడు ప్రయోజనం లేదనేది టీడీపీలోనే విన్పిస్తున్న వ్యాఖ్యలు. విశాఖ, నెల్లూరు జిల్లాల్లో సమీక్షల్లోనూ కొందరు తెలుగుతమ్ముళ్లు ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జగన్ తనంతట తానుగా ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకుంటే తప్ప చంద్రబాబు ఎన్ని విమర్శలు చేసినా శూన్యమే