హైద్రాబాద్, అక్టోబరు 21, (way2newstv.com)
వెన్యూ కోడ్‌లో సవరణలు చేస్తూనే కొన్ని విభాగాలను రద్దు చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తుంది. గతంలో యూఎల్సీ విభాగాన్ని రద్దు చేసిన ప్రభుత్వం ఆ తరువాత భూ సేకరణ ప్రత్యేక విభాగాన్ని రద్దు చేసి ఆయా బాధ్యతలను జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది. ఇప్పటివరకు భూ సేకరణ విభాగంలో ఉన్న నామమాత్రపు సిబ్బందిని రెవెన్యూ శాఖకు బదిలీ చేసింది. దీని రద్దు తరువాత భూ సేకరణ బాధ్యతలు జాయింట్ కలెక్టర్ల పరిధిలోకి వచ్చాయి. తాజాగా సర్వే సెటిల్‌మెంట్ శాఖ రద్దుపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా సమాచారం. ఇప్పటికే మొదలుపెట్టిన రెవెన్యూ సంస్కరణల అమలులో ఎదురవుతున్న సమస్యలను వీలైనంత వేగంగా పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
రెవెన్యూ చట్టం దిశగా అడుగులు
వచ్చే మూడునెలల్లో ఈ సమస్యలను పరిష్కరించి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలన్న కృతనిశ్చయంలో ప్రభుత్వం ఉంది.పాత చట్టాలను సవరించడం, కుదించడంతో పాటు కొత్తచట్టంలో రెవెన్యూ కోడ్ అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ధరణి వెబ్‌సైట్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, అందులో భాగంగానే ఆలస్యమయినా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలను అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో అన్నిరకాల భూముల వివరాలను తహసీల్దార్‌లు ధరణి ఫోర్టల్ నిక్షిప్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో ఇప్పటికిప్పుడు ఏవైనా సంస్కరణలు అమలు చేసినా తక్షణం ఫలితాలు వచ్చేలా కనిపించడం లేదు. మరోవైపు ఆన్‌లైన్‌లో,మ్యుటేషన్ విధానంలో ధరణిలో తప్పుల సవరణ ఆప్షన్‌లో అనేక తాత్కాలిక సమస్యలు కష్టంగా మారినట్టు క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. పట్టాదారు పాసు పుస్తకాల తప్పుల సవరణ మొదలు పార్ట్‌బిలోని వివాదాస్పద భూముల సమస్యలను కొలిక్కి తెచ్చేందుకు మరికొంత సమయం పట్టనుందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సమస్యలు క్రమంగా తొలగించుకుం టూనే కొత్త చట్టం రూపకల్పన 1999 ఎపి రెవెన్యూ కోడ్‌లో సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం.భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా విఆర్‌ఏ, విఆర్‌ఓ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయ ని తేటతెల్లం అయ్యింది. ఉన్న ప్రభుత్వ భూములను కాపాడుకుంటూనే కోర్టు కేసులను గెలవాలని ప్రభుత్వం రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండిఏ పరిధిలో రూ.15 వేల కోట్ల విలువైన ప్రభు త్వ భూములు రికార్డుల్లో కనిపించడం లేదని భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా తేలింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, సర్వే చేసైనా భూమిని కాపాడుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. గతంలో కోకాపేట భూ ములు కబ్జాదారుల నుంచి ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంది. కోకాపేట భూముల మాదిరిగానే మిగతా ప్ర భుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కేసులకు సంబంధించి కోర్టులు, ట్రిబ్యునల్‌లో ప్రభుత్వం తరఫున గట్టి వాదనలు వినిపించాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది.హెచ్‌ఎండిఏ పరిధిలోని 3,083 ఎకరాల భూ వివాదాల్లో ఉందని, మరో 600 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురయ్యిందని అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ శాఖ దానిపై పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వం హెచ్‌ఎండిఏ కేటాయించిన భూముల్లో ఎక్కువగా అధికభాగం రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. 8,364 ఎకరాలు రంగారెడ్డి, మెదక్ జిల్లాలోనే ఉన్నాయి. వీటిని వేలం వేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించడంతో అసలు విషయం బయటపడింది. ఈ భూముల్లో 40 శాతానికి పైగా దాదాపు 2845 ఎకరాలు వివాదాల్లో ఉన్నాయని తేలడంతో వీటిని స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ శాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 2,250 ఎకరాలు జవహర్‌నగర్‌లో, 640 ఎకరాలు కోకాపేట్‌లో, 600 ఎకరాలు మియాపూర్‌లో ఉన్నాయని గతంలో ప్రభుత్వం గుర్తించింది. అందులో నుంచి 1500 ఎకరాల (కోకాపేట, బుద్వేల్)కు చెందిన భూమిని 2007 నుంచి 2014 వరకు వేలం వేసి సుమారు రూ.2,500 కోట్ల నిధులను అప్పటి ప్రభుత్వం సమీకరించింది. అయితే మిగిలిన భూమిని కాపాడుకోవడంతో పాటు వాటిని వేలం వేసి నిధులను సమీకరించుకోవాలని ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తోంది.