జనసే కు పార్థసారధి గుడ్ బై - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జనసే కు పార్థసారధి గుడ్ బై

విశాఖపట్టణం, అక్టోబరు 3 (way2newstv.com)
జనసేన పార్టీకి మరో ముఖ్యమైన నేత షాకిచ్చారు. పార్టీకి, పదవికి చింతల పార్థసారధి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ కార్యాలయానికి పంపించారు. పార్థసారధి ప్రస్తుతం గవర్నమెంట్ జనసేన పార్టీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మానిటరింగ్ ఛైర్మన్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్థసారధి రాజీనామా కారణాలు గురించి తెలియాల్సి ఉంది.పార్థసారధి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అంతేకాదు మొదటి నుంచి పార్టీలో ముఖ్యమైన నేతగా వ్యవహరిస్తున్నారు.
జనసే కు పార్థసారధి గుడ్ బై

ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మానిటరింగ్ ఛైర్మన్‌గా పదవిలో నియమించారు. అయితే ఉన్నట్టుండి ఆయన పార్టీకి రాజీనామా చేయడం హాట్‌టాపిక్‌‌గా మారింది.పార్థసారధి ఏ పార్టీలో చేరబోతున్నారనే చర్చ మొదలయ్యింది. బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కొందరు జనసేన పార్టీ జిల్లాస్థాయి నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈయన కూడా అందుకే పార్టీకి గుడ్ బై చెప్పారనే ప్రచారం జరుగుతోంది. మరి ఆయన అడుగులు ఏ పార్టీ వైపు ఉంటాయన్నది ఆసక్తిగా మారింది. ముఖ్యమైన నేతగా ఉన్న పార్థసారధి ఇలా రాజీనామా చేయడం జనసేనకు ఇబ్బందనే చెప్పాలి.