కండ్లు మిరుమిట్లు గోలి పిన మహా బతుకమ్మ వేడుకలు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కండ్లు మిరుమిట్లు గోలి పిన మహా బతుకమ్మ వేడుకలు...

బొడ్డెమ్మ లు ఆడిన  మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పి, జడ్పీ చైర్మన్లు
వనపర్తి అక్టోబరు 3, (way2newstv.com)
తంగేడు పూలు తోవ గాచే. తల్లిగారు యాదుకోచే ఎప్పుడొస్తావన్నయ్య నన్ను తోలుకపోనీకే,.. పచ్చిపాల వెన్నెల నేలలో పారబోసి నట్లు పూ సనే గునుగు పూలతోటలంటూ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జిల్లా ఎస్పీ అపూర్వ రావు, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, గద్వాల జడ్పీ చైర్మన్ సరిత లు పాడుతుండగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అలంపూర్ ఎమ్మెల్యేఅబ్రహం వారితో పాటుగా కోలాటాల ను వేస్తూ కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా మహా బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 
కండ్లు మిరుమిట్లు గోలి పిన మహా బతుకమ్మ వేడుకలు...

బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని నల్ల చెరువుపై నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పై మహా బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకల్లో పట్టణ మహిళలు ,ముస్లిం మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మలనుఆడారు.  బతుకమ్మ వేడుకలు సందర్భంగా మినీ ట్యాంక్ బండ్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా విద్యుత్ దీపాలతో అలంకరించి బతుకమ్మ పండుగను నిర్వహించారు.అనంతరం జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, ఎస్పీ అపూర్వ రావు, గద్వాల జెడ్ పి చైర్మెన్ సరిత చెరువులో బొడ్డెమ్మను నిమజ్జనం చేశారు