నష్టాల్లో ముగిసిన మార్కెట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై, అక్టోబరు 24, (way2newstv.com)
దేశీ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఆరంభంలో ర్యాలీ చేసిన బెంచ్‌మార్క్ సూచీలు చివరకు నష్టాల్లో క్లోజయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లలో తీవ్ర అమ్మకాలు కొనసాగాయి. దీంతో మార్కె్ట్ నష్టాలనే చూడాల్సి వచ్చింది.సెన్సెక్స్ 38 పాయింట్ల నష్టంతో 39,020 పాయింట్ల వద్ద, నిఫ్టీ 21 పాయింట్ల నష్టంతో 11,582 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు ఇండెక్స్‌లపై ప్రతికూల ప్రభావం చూపాయి.
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

✺ నిఫ్టీ 50లో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, టైటన్ షేర్లు లాభాల్లో ముగిశాయి.రిలయన్స్ 3 శాతానికి పైగా పరుగులు పెట్టింది.
✺ భారతీ ఇన్‌ఫ్రాటెల్, గ్రాసిమ్, యస్ బ్యాంక్, ఎస్‌బీఐ, గెయిల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. భారతీ ఇన్‌ప్రాటెల్ దాదాపు 8 శాతం పడిపోయింది.
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఏకంగా 3 శాతానికి పైగా పడిపోయింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 1 శాతానికి పైగా పతనమైంది.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.31 శాతం తగ్గుదలతో 60.98 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.54 శాతం క్షీణతతో 55.66 డాలర్లకు తగ్గింది.✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడవుతోంది. 10 పైసలు నష్టపోయింది. 71.02 వద్ద కదలాడుతోంది.