నిలిచిన ప్రగతి చక్రం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిలిచిన ప్రగతి చక్రం

ప్రత్యామ్నాయ  ఏర్పాట్లలో రవాణా శాఖ
జగిత్యాల అక్టోబర్ 01 (way2newstv.com)
ఆర్టీసీ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మె కారణంగా జిల్లా కేంద్రమైన జగిత్యాలలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో రోడ్డురవాణా శాఖ తోపాటు పోలీస్ యంత్రాంగం ప్రైవేట బస్సు లతోపాటు స్కూల్ బస్సులను నడుపుతోంది.కొన్ని బస్సులను ప్రయివేటు సిబ్బందిచే నడుపుతున్నారు. దింతో జగిత్యాల డిపోఎదుట ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చని కారణంగా సమ్మెకు మద్దతు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. 
  నిలిచిన ప్రగతి చక్రం

అటుపండగపూట ఆర్టీసీ కార్మికులు పిలుపు నివ్వడo పట్ల కార్మికుల సమ్మె తీరుపై ప్రజల్లో కూడా నిరసన వ్యక్తం అవుతుంది. ఏమైనప్పటికీ జగిత్యాల డిపో , కొత్త బస్ స్టాండ్ ప్రాంతాల్లోపోలీస్ పహారా సాగుతోంది. జగిత్యాల డిపో ఎదుట పెద్ద ఎత్తున చేరుకున్న కార్మిక సంఘాల నాయకులు, కార్మికులతో నిరసన సాగుతోంది .అయితే అక్కడికి చేరుకున్న మీడియాతోకార్మిక సంఘాలు నాయకులు ,కార్మికులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని వాపోయారు. తాము సమ్మెకు వెళ్తే ప్రైవేటువ్యక్తులతో వాహనాలు నడుపుతున్నరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి డిపోలు బస్టాండ్ వద్ద పోలీసు పహార ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇకపోతేసమీప పట్టణ, గ్రామాల్లోకి వెళ్లే ప్రజలు ఆటోలను ఆశ్రయిస్తున్నారు.దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు రవాణా శాఖ బందోబస్తుతో వెళ్తున్న ప్రయివేటు, స్కూల్ బస్సు ల్లో వెళ్తున్నారు.