నల్గొండ, అక్టోబరు 23, (way2newstv.com)
ఉపఎన్నిక రోజున ఎస్సైకు వార్నింగ్ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా సైదిరెడ్డి.. గరిడేపల్లి మండలం కల్మల చెరువు పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్లారు. స్థానిక నేతలతో కలిసి ఆయన బూత్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్న ఎస్సై రాంఘవేందర్ రెడ్డి.. ఆయన్ను లోపలికి వెళ్లనీయలేదు. దీంతో సదరు ఎస్సైపై టీఆర్ఎస్ అభ్యర్థి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సైది రెడ్డిపై కేసు
‘‘ఓవర్ యాక్షన్ వద్దు.. ఎక్కువ తక్కువ మాట్లాడకు.. ఏం హీరో అనుకుంటున్నావా.. నువ్వేమైనా? బయటోడు బయటోడు అంటావ్..? తగ్గు కొద్దిగా.. అంటూ ఎస్సైతో ఎమ్మెల్యే అభ్యర్థి ఘాటుగా మాట్లాడారు. ఈ వీడియో బయటకు రావడంతో.. సైదిరెడ్డిపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అధికార పార్టీ అభ్యర్థి కావడంతోనే.. విధి నిర్వహణలో ఉన్న ఎస్సై పట్ల సైదిరెడ్డి దౌర్జన్యం చేశారని.. ఇది సమర్థనీయం కాదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఎస్సై రాఘవేందర్ రెడ్డి విధులకు అడ్డంకి కలిగించడంతో.. సైదిరెడ్డిపై 356, 504 సెక్షన్ల కింద కేసు నమోదైంది