నీటిలోనే లోతట్టు ప్రాంతాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నీటిలోనే లోతట్టు ప్రాంతాలు

రాజమండ్రి, అక్టోబరు 24, (way2newstv.com)
తూర్పు గోదావరి లో జోరు వాన కురిసింది. డెల్టా.. మెట్ట.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో  లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.భారీ వర్షాలకు డెల్టాలో వరి చేలకు నష్టం కలిగే పరిస్థితులు తలెత్తుతున్నాయి. వర్షాలకు తూర్పుడెల్టా పరిధిలో రామచంద్రపురం, కపిలేశ్వరపురం, కాజులూరు, కరప, తాళ్లరేవు, మధ్యడెల్టా పరిధిలో ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు సబ్‌ డివిజన్‌ పరిధిలో పెద్ద ఎత్తున వరి చేలు నేలకొరిగాయి. ముఖ్యంగా ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన మండలాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేలు నేలనంటడంతో పొలాల్లో నీరు దిగే అవకాశం లేకుండాపోయింది. దీంతో వరి కంకులు నీట నానుతున్నాయి. ప్రస్తుతానికి పెద్దగా నష్టం లేకున్నా వర్షాలు కొనసాగితే ముప్పు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.  
నీటిలోనే లోతట్టు ప్రాంతాలు

అమలాపురంలో వరుసగా మూడు రోజులూ భారీ వర్షం కురవడంతో ముంపు తీవ్రత మరింత పెరిగింది. తీర ప్రాంత మండలాల్లో వరిచేలు వర్షానికి నేలనంటుతున్నాయి. ఇది రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకూ పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జిల్లాలో సగటున 21 మిల్లీవీుటర్ల చొప్పున 1345 మిల్లీవీుటర్ల వర్షం కురవగా, అత్యధికం అమలాపురం 64.2 మిల్లీవీుటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా మారేడుమిల్లిలో 2.4 మిల్లీవీుటర్లు  పడింది. ఏజెన్సీలో విలీనల మండలాలు నాలుగు మినహా మిగిలిన అన్ని మండలాల్లోనూ, ప్రత్తిపాడు, సీతానగరం, గం గవరం, కోరుకొండ, గండేపల్లి, తుని ప్రాంతా ల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది.రౌతులపూడి, తొండంగి, కోటనందూరులో భారీ వర్షం కురిసింది. మెట్టలోని ఏలేశ్వరంలో 48.6 మిల్లీవీుటర్ల వర్షం పడింది. ఇక డెల్టాలో కపిలేశ్వరపురం, కె.గంగవరం, కాట్రేనికోన, కాకినాడ అర్బన్, రూరల్, రామచంద్రపురం, పెదపూడి, పిఠాపురం, ఉప్పలగుప్తం తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. అడపా దడపా భారీ వర్షం కురవడం, తరువాత ఒక మోస్తరు వర్షం చొప్పున డెల్టా ప్రాంతంలో పడుతూనే ఉంది. రాజమహేంద్రవరం భారీ వ ర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగాయి. హైటెక్‌ బస్టాండ్, కంబాల చెరువు, సీతంపేట, మూలగొయ్యి తదితర ప్రాంతాలు నీట మునిగాయి. కాకినాడ నగరంలో సినిమారోడ్డు, రామారావు, రాజీవ్‌నగర్, విద్యుత్తు నగర్‌ వంటి శివారు ప్రాంతాలు నీట మునిగాయి. మున్సిపల్‌ కార్యాలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది.నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అమలాపురంలో లోతట్టు కాలనీలు మంపునకు గురయ్యాయి. ఈ నెల 19వ తేదీన అమలాపురంలో రికార్డుస్థాయిలో 182.4 మిల్లీవీుటర్లు, 20వ తేదీన 54.6 మిల్లీవీుటర్లు, 21న 8.2 మిల్లీవీుటర్లు, ఇక 22వ తేదీన 64.2 మిల్లీవీుటర్ల వర్షం కురిసింది. నాలుగు రోజుల్లో మూడు రోజులు భారీ వర్షం కురవడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ముంపు తీవ్రత మరింత పెరిగింది. ముఖ్యంగా అమలాపురం హౌసింగ్‌ బోర్డు కాలనీల్లో ముంపు కష్టాలు రెట్టింపయ్యాయి.  కురిసిన వర్షానికి జల దిగ్బంధంలో చిక్కుకున్న ఈ కాలనీలో నీరు దిగేందుకు మంత్రి పినిపే విశ్వరూప్‌ చొరవతో జేసీబీలు ఏర్పాటు చేసి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. ముంపునీరు దిగుతున్న సమయంలోనే వర్షాలు పడుతుండడంతో ఫలితం లేకుండా పోయింది. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. డెల్టాతో పోల్చుకుంటే ఏజెన్సీలో వర్షం పెద్దగా లేదనే చెప్పాలి. విలీన మండలాలైన నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరహరామచంద్రపురంలో వర్షం లేదు