కూరలకు రెక్కలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కూరలకు రెక్కలు

గుంటూరు, అక్టోబరు 25, (way2newstv.com)
కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. వారం రోజులుగా ఈ ధర పెరుగుతున్నందున వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. దాదాపు అన్ని రకాల కూరగాయలను సగటున కిలో రూ.40కి పైగానే విక్రయిస్తునారు. చిక్కుడు ఒక్కసారిగా కిలో రూ.70కి చేరింది. క్యారెట్‌ కిలో ధర రూ. 64కి పెరిగింది. విజయవాడ మార్కెట్‌కు హైదరాబాద్‌ నుంచి మాత్రమే క్యారెట్‌ వస్తోంది. దీపావళి సందర్భంగామార్కెట్‌కు రెండు రోజులు వరుస సెలవులు ఇవ్వడంతో ఆ ఫ్రభావం క్యారెట్‌ ధరపై పడిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రిటైల్‌ మార్కెట్‌లో ధర పెరిగిందంటున్నారు. గుత్త మార్కెట్‌లో పది కిలోల క్యారెట్‌ ధర రూ. 60 ఉండగా, విడిగా కిలో రూ.70కి విక్రయిస్తు న్నారు. క్యాప్సికం, బీన్స్‌ కూడా ధరలు పెరిగిపోయాయి. కిలో రూ.80 వరకు వాటి ధర పెరిగింది. దొండ కిలో రూ. 40కి విక్రయిస్తున్నారు. 
కూరలకు రెక్కలు

కొత్తిమీర సైతం అమాంతం కిలో రూ.140 నుంచి రూ. 160 వరకు పెరిగింది. కిలోకు రెండు కట్టలు మాత్రమే వస్తున్నాయి. విజయవాడ రైతు బజార్‌లో ఒక్కో చిన్నకట్ట రూ.60కి విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధరలైతే ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు అమ్ముతున్నారు. చిక్కుళ్లు, క్యారెట్‌ ధర అక్కడ రూ.100 చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. రైతు బజార్‌లో కిలో ఉల్లి రూ.24 ఉండగా, టమోటా రూ. 30కి అమ్ముతున్నారు. అవి కూడా నాసిరకంగా ఉంటున్నాయి. ఉల్లిపాయలు గోళీల్లా ఉంటు న్నాయి. టమోటా కూడా రెండో రకం మాత్రమే విక్రయిస్తు న్నారు. వినియోగదారులు తప్పని పరిస్థితుల్లో వాటినే కొనుగోలు చేయాల్సి వస్తోంది.రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలకు పంటలు ధ్వంసం కావడం వల్లనే కూరగాయల ధరలు పెరిగాయని వ్యాపా రులు చెబుతున్నారు. దీనికి తోడు కార్తీక మాసం కావడంతో డిమాండ్‌ పెరిగింది. ఆకు కూరలు, కొన్ని రకాల కాయ గూరలకు డిమాండ్‌ బాగా ఉంది. పంట దిగుబడి సక్రమం గానే ఉన్నా కార్తీకమాసం డిమాండ్‌ వల్ల కూరగాయల ధరలను పెంచేశారని వినియోగదారులు వాపోతున్నారు.