53 రోజుల తర్వాత విధుల్లోకి... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

53 రోజుల తర్వాత విధుల్లోకి...

హైద్రాబాద్, నవంబర్ 29  (way2newstv.com)
55 రోజుల తరువాత తెలంగాణలో ఆర్టీసీ బస్సులు తిరిగి కదిలాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ప్రతిష్ఠంభనకు తెరదించడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో తెల్లవారు జాము నుంచే కార్మికులు ఉత్సాహంగా విధుల్లోకి చేరుతున్నారు. సీఎం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంస్థను వృద్ధిలోకి తీసుకొస్తామని కార్మికులు పేర్కొన్నారు. అమరులైన కార్మిక కుటుంబ సభ్యులకు పరిహారం అందించడంతో పాటు వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పడం పట్ల కేసీఆర్‌కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే అమరులైన వారికి ఎం చేసినా తమతో కలిసి ఉండాల్సిన వారు ఇవాళ భౌతికంగా లేకపోవడం పట్ల కార్మికుల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 
53 రోజుల తర్వాత విధుల్లోకి...

ఎటువంటి షరతులు లేకుండా తిరిగి విధుల్లో చేరాలని నిన్న రాత్రి సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులు, తెల్లవారుజాము నుంచే డిపోల వద్ద బారులు తీరారు. విధుల్లో చేరిపోయి, తమ బస్సులను బయటకు తీశారు. నిత్యమూ ఫస్ట్ బస్ లను బయటకు తీసేవారు 3.30 గంటల సమయంలోనే డిపోలకు చేరుకోవడం గమనార్హం. ఇక దాదాపు రెండు నెలలుగా మూతబడిన టీఎస్ ఆర్టీసీ ఆన్ లైన్ రిజర్వేషన్ వెబ్ సైట్ ను తిరిగి తెరవనున్నామని అధికారులు వెల్లడించారు. సమ్మెలో పాల్గొన్న దాదాపు 50 వేల మంది ఉద్యోగులూ తిరిగి విధుల్లో చేరనుండటంతో, ఆర్టీసీ బస్సులు  నుంచే పూర్తి స్థాయిలో తిరగనున్నాయి.
దటీజ్ కేసీఆర్
రాజు బలవంతుడు అయితే రాజ్యం అదుపాజ్ఞల్లో ఉంటుంది. కేసీఆర్ చతురుడు, చాణక్యుడు., శత్రువు వ్యూహాలు ఎరిగిన వాడు. అనువు కోసం ఎదురు చూసిన వాడు. కాలం కలిసి రాకున్నా ఎప్పుడూ ఎక్కడా తొణక లేదు. అప్పుడు ఇప్పుడు…. అంతా అయిపోయింది అనుకున్న వేళ… ఓటమి ఆవహించిన వేళ కూడా నిరాశ పడలేదు. నెత్తుటి చుక్క చిందకుండా అనుకున్నది సాధించాడు. నెత్తురు చిందలేదా అంటే….. కేసీఆర్ ఉద్యమాన్ని హింసాత్మకం చేసి ఉంటే ఎప్పుడో అది మట్టి కరిచేది. ఉద్యమాన్ని అదుపాజ్ఞల్లో ఉంచినా., అది పక్కదారి పట్టకుండా కోరుకున్నది సాధించడం… కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమైంది.మిగతా వారి త్యాగాలు, పోరాటాలు , ఆందోళనలు, ఆవేశాలు స్వీయ ప్రయోగాలో, భావావేశాలో తప్ప సొంతం కాదు. 2009 డిసెంబర్ 9 తర్వాత కూడా చాలా మంది తెలంగాణ రాదని నమ్మకంగా ఉన్నా, సడలని సంకల్పంతో ఉన్నది కేసీఆర్ ఒక్కడే. ఇన్నేళ్ల తర్వాత అక్కడ సంక్షోభ పరిస్థితులు, ప్రజల కష్టాలు, కన్నీళ్లు, భావోద్వేగాలు చూసిన తర్వాత మనసెరిగిన రాజు ఎలా చేస్తాడని ఆశిస్తారో అలాగే ప్రవర్తించాడు.ఎంతటి క్రౌర్యం.., ఎంతటి కర్కశత్వం….. జాలి దయ లేని రాతి హృదయం అని ప్రత్యర్థులు గేలి చేసినా చలించనిది అందుకే. తనకు తన లక్ష్యం తెలుసు. అందుకే మళ్ళీ గెలిచాడు.. ఉద్యమాన్ని , సమ్మెల్ని కాదు జనం హృదయాలను….. ఇది వ్యతిరేక అర్థంలో కూడా ప్రచారం చేయొచ్చు. కానీ తర్కం, సత్యం, వాస్తవిక పరిస్థితులను బేరీజు వేస్తే ఆయన చేసినదే కరెక్ట్. రాజు కఠినాత్ముడు, క్రూరుడు కానక్కర్లేదు….. ప్రజలకు దయార్ద్ర హృదయుడు అని అనిపిస్తే చాలు… మళ్ళీ నమ్మడానికి. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో అదే జరిగింది. తిట్టిన తిట్లు…పెట్టిన శాపనార్ధాలు మరిచి ఇప్పుడు కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తున్నారు. దటీజ్ కేసీఆర్.