విజయవాడ, నవంబర్ 19, (way2newstv.com)
లింగమనేని ప్రాజెక్ట్స్ దివాలా తీసిందని వచ్చిన కథనాలపై లింగమనేని రమేష్ వివరణ ఇచ్చారు. తమ సంస్థ దివాలా తీసినట్టు ప్రకటించాలని తామెప్పుడూ కోరలేదన్నారు. కొన్ని మీడియా సంస్థలు దురుద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. తప్పుడు ప్రచారం చేసిన మీడియా సంస్థలకు నోటీసులు ఇచ్చామన్నారు. జర్మనీకి చెందిన సంస్థతో 2014లో ఎయిర్ కోస్తా ఒప్పందం చేసుకుందని.. ఇందులో సమస్యలు రావడంతో.. వాటిని పరిష్కరించుకునే లోపే..
మాకు ఆర్ధిక ఇబ్బందులు లేవు
సదరు సంస్థ లా ట్రైబ్యునల్‌లో దివాలా పిటిషన్ వేసిందని తెలిపారు.జర్మన్ సంస్థ పిటిషన్ ఆధారంగా.. కంపెనీస్ లా ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ వ్యవహారంతో ఎల్‌ఈపీఎల్‌లోని ఇతర కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని లింగమనేని వివరించారు. తమకు సంస్థకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, రుణ దాతలకు చెల్లింపులు చేయలేని పరిస్థితి ఎప్పుడూ రాలేదని చెప్పారు.లింగమనేని రమేష్ గానీ, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ గానీ ఎప్పుడూ న్యాయస్థానంలో దివాలా పిటిషన్ దాఖలు చేయలేదని ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.