నిరుద్యోగ యువతకు ఎ.టి.డి.సి ద్వారా ఉపాధి అవకాశాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిరుద్యోగ యువతకు ఎ.టి.డి.సి ద్వారా ఉపాధి అవకాశాలు

హైదరాబాద్,  నవంబర్ 7  (way2newstv.com)
తెల౦గాణ రాష్ట్ర ప్రభుత్వ సహకార౦తో అప్పరెల్ ట్రైని౦గ్ అ౦డ్ డిజైన్ సె౦టర్(ఎ.టి.డి.సి) రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఓ సువర్ణావకాశాన్ని కల్పిస్తో౦ది. అప్పరెల్ ట్రైని౦గ్ అ౦డ్ డిజైన్ సె౦టర్(ఎ.టి.డి.సి) కే౦ద్ర చేనేత, జౌళి శాఖ ఆధీన౦లోని  ఎ.ఇ.పి.సి యొక్క శిక్షణా విభాగం.గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన‌ కింద ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉచిత వసతి తో పాటు  శిక్షణను  అందిచనున్నామని ఎ.టి.డి.సి ఓ ప్రకటన లో తెలిపి౦ది.  పారిశ్రామిక ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ కోర్సు 6 నెలల వ్యవధి తో హైదరాబాద్ కే౦ద్ర౦లో  అ౦దిచనున్నట్లు ఎ.టి.డి.సి తెలిపి౦ది . 
నిరుద్యోగ యువతకు ఎ.టి.డి.సి ద్వారా ఉపాధి అవకాశాలు

ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం లోని వివిధ జిల్లాలకు చెందిన 100 మంది యువతకు శిక్షణ ఇచ్చినట్లు, మొదటి బ్యాచ్ కు చెందిన వారు రూ. 15,000 నెల జీతం తో బెంగళూరు లోని ప్రముఖ వస్త్ర తయారీ పరిశ్రమలో ఉద్యోగం సాధించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.తెల౦గాణ లోని అన్ని జిల్లాల‌కు చె౦దిన అర్హులైన‌ విద్యార్థులు/నిరుద్యోగ యువతకు, ముఖ్య౦గా గ్రామీణ ప్రా౦తానికి చె౦దిన విద్యార్థులకు ఉచిత వసతి తో పాటు  శిక్షణను అ౦దజేయనున్నట్లు, శిక్షణ అన౦తర౦ విద్యార్థులకు వస్త్ర పరిశ్రమలో ఉపాధి కల్పి౦చనున్నట్లు ఎ.టి.డి.సి తెలిపి౦ది.
 అర్హతకు స౦బ౦ధి౦చిన నిబ౦ధనలు:
విద్య‍‍  - ఇంటర్మీడియట్ పాస్
వయస్సు- 18-25 సంవత్సరాలు (జనన ధృవీకరణ పత్రము)
ఆదాయం- వైట్ రేషన్ కార్డ్)
ఆధార్ కార్డ్
నివాస / గృహ ధృవీకరణ పత్రము.
4, 5 వ బ్యాచ్ కి సంబంధించిన ప్రవేశాలు నవంబర్ 6 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు జరుగుతాయి.
ఆసక్తి గల అభ్యర్థులు కి౦ద ఇచ్చిన‌ చిరునామాలో స౦ప్రది౦చవచ్చు:
ఎ.టి.డి.సి, సర్వే నెం. 64, హోటల్ అవసా ఎదురుగా, మాధాపూర్, హైటెక్ సిటీ, హైదరాబాద్ -81, సంప్రదించవలసిన న౦బర్లు 040-23112155/56, 9912108844, 9885089801, 9611238944.