విశాఖలో గంటా ప్లేస్ ఎవరికి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విశాఖలో గంటా ప్లేస్ ఎవరికి

విశాఖపట్టణం, నవంబర్ 13  (way2newstv.com)
విశాఖ జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్టయిల్ వేరు. మందిగా వస్తారు, మందిగానే పార్టీని వదిలిపెడతారు. దాంతో ఆయన పార్టీ మారితే చాలు అక్కడ పెద్ద ఖాళీ ఏర్పడుతుంది. ఆయనతో పడనివారంతా ఆయనలా హవా చలాయించాలనుకుంటారు. గంటా శ్రీనివాసరావు ప్లేస్ కోసం పోటీ పడతారు. విశాఖ జిల్లా రాజకీయాల వరకూ వస్తే గంటా శ్రీనివాసరావు బిగ్ ఫిగర్ అని చెప్పాలి. ఆయన టీడీపీలో ఉన్నపుడు ఆయన‌దే పై చేయి. ఇపుడు ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని టాక్. అసలు పార్టీ ఎన్నికల్లో ఓడిపోయాక పార్టీ ఆఫీస్ వైపు తొంగి చూడలేదు, వంగి వాలలేదు. దాంతో ఆయన ఇక పార్టీలో ఉండరని వ్యతిరేక వర్గం నేతలు ఎపుడో తీర్మానించేసుకున్నారు. దాంతో గంటా శ్రీనివాసరావు లేని అర్బన్ జిల్లాలో పట్టు సంపాదించేందుకు ఎవరి మటుకు వారే పావులు కదుపుతున్నారు.
విశాఖలో గంటా ప్లేస్  ఎవరికి

విశాఖ అర్బన్ జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావుతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో విశాఖ తూర్పు అసెంబ్లీ సీటు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు మూడోసారి ఎమ్మెల్యే కావడంతో సీనియర్ కింద లెక్క. మరో వైపు విశాఖ పశ్చిమ నుంచి గెలిచిన గణబాబుకి కూడా ఇది మూడవసారే. విశాఖ దక్షిణం నుంచి ఎమ్మెల్యే అయిన వాసుపల్లి గణేష్ కుమార్ రెండవమారు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే వీరిలో అంగబలం, అర్ధంబలం బాగా ఉన్న్న వెలగపూడి ఓ రేంజిలో హవా చాటుకుంటున్నారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలను తన వెంట బెట్టుకుని ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ధర్నాలు, ఆందోళను, ఇలా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వెలగపూడి జనంలోకి వచ్చి ముందు వరసలో ఉంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఆర్ధికంగా బలవంతుడు కావడంతో ఆయన పార్టీని ఒంటిచేత్తో నడిపేవారు. ఇపుదు వెలగపూడి ఆర్ధికంగా తాను తీసిపోనని అంటున్నారు. దాంతో గంటా శ్రీనివాసరావు తరహాలో అర్బన్ జిల్లా పార్టీ రాజకీయాలను శాసించాలనుకుంటున్నారు.నిజానికి గంటా శ్రీనివాసరావు కాపు సామాజిక వర్గం అర్బన్ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. దానికి తోడు గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యూహాలు వేరుగా ఉంటాయి. ఆయన మంత్రిగా అటు అధికారులను, ఇటు పార్టీ నాయకులను కూడా కలుపుకుని మెప్పించారు. గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడితే పార్టీ పరంగా ఎప్పటికీ తీరని లోటు అని తమ్ముళ్లే అంటున్నారు. 2009 ఎన్నికలకు ముందు గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యంతో చేరితే విశాఖ అర్బన్ జిల్లాలో కాంగ్రెస్ పాగా వేసింది. గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యం నుంచి ముగ్గురిని గెలిపించుకున్నారు. టీడీపీ దారుణంగా నష్టపోయింది. ఇపుడు కూడా గంటా శ్రీనివాసరావు మైనస్ టీడీపీ అంటే సైకిల్ పార్టీకి పెద్ద దెబ్బేనని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు మార్క్ రాజకీయాలు ఎవరూ చేయలేరని కూడా అంటున్నారు. ఆయన కనుక పార్టీని వీడితే అర్బన్ జిల్లాలో టీడీపీ బలహీనపడుతుందని అంటున్న వారు కూడా సొంత పార్టీలో ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా నియోజకవర్గం దాటి జిల్లా స్థాయిలో నాయకత్వం వహించలేరని కూడా అంటున్నారు.