ఆడకత్తెరలో పోకచెక్కలా జగన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆడకత్తెరలో పోకచెక్కలా జగన్

హైద్రాబాద్, విజయవాడ, నవంబర్ 2, (way2newstv.com)
ఇప్పడయితే వారం రోజులకు ఒకసారి. ఇక రోజూ విచారణ జరిగితే…? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై 2011 లో నమోదయిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి ఎనిమిదేళ్లు గడిచాయి. ఇందులో 14 నెలలు జైలు జీవితం గడిపిన జగన్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్ రెక్కల కష్టంతో సంపాదించుకున్న పదవి అది. ఊరికే రాలేదు. ప్రజలు కూడా ఈ కేసుల ఆరోపణలను నమ్మలేదు కాబట్టే జగన్ కు జై కొట్టారు.అయితే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యకు ప్రయత్నించారు. ప్రధాని నరేంద్రమోడీని రెండు సార్లు కలిశారు. ఇటీవల హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను సయితం కలిశారు. 
ఆడకత్తెరలో పోకచెక్కలా జగన్

అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలపై చర్చ జరిగిందని చెబుతున్నా జగన్ భేటీకి అసలు కారణం ఈ కేసుల గొడవేనంటున్నారు. కొద్దిరోజుల క్రితమే న్యాయస్థానంలో సీబీఐ స్వరం పెంచడాన్ని జగన్ గమనించారు.అందుకే జగన్ అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారన్న ప్రచారం ఉంది. అందులో తప్పేమీ లేదు. తనపై అక్రమ కేసులు పెట్టారంటున్నారు జగన్. ఆ కేసులు పెట్టింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు బీజేపీ ఉన్నప్పటికీ సీబీఐ జగన్ కేసుల విషయంలో కొంత దూకుడుగా వెళుతుందంటే అందుకు కారణం అనుమానించక తప్పదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్ కేసులను వేగవంతం చేయాలని మోడీ సర్కార్ పై వత్తిడి పెట్టారు. కానీ అప్పట్లో మోదీ అంగీకరించలేదంటారు. 29 సార్లు చంద్రబాబు ఢిల్లీ వెళ్లానని చెబుతున్నా అందులో సింహభాగం అప్పటి ప్రతిపక్షనేత జగన్ కేసులను పరుగులు పెట్టించడానికే.2019 ఎన్నికలకు ముందే జగన్ ను జైలులోకి పంపించాలన్న ప్రణాళిక కూడా పసుపు పార్టీ అప్పట్లో వేసిందంటారు. కానీ అది ప్రచారమేననే వారు లేకపోలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే తేడా కొడుతున్నట్లే కన్పిస్తుంది. జగన్ కు కూడా డౌట్ కొట్టింది. అందుకే ఆయన ఏం జరిగినా సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వారానికి ఒకరోజు విచారణకు జగన్ హాజరవుతారు. పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే రోజు వారీ విచారణ ప్రారంభమయితే ఎలా? అన్నదే ప్రశ్న. మొత్తం మీద జగన్ కు ఇబ్బందులు మున్ముందు తప్పవన్న సంకేతాలు బలంగా అందుతున్నాయి.
తమ్ముళ్లలో ఆనందం
ఒక్క దెబ్బకు జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్నదే టీడీపీ సంబరానికి అసలు కారణం. తాము ప్రతీ రోజూ జగన్ మీద ఎన్ని ఆరోపణలు చేసినా జనం పట్టించుకోరని, అదే కళ్ళ ముందే జగన్ కోర్టు మెట్లు ప్రతీ శుక్రవారం ఎక్కుతూ ఉంటే మాత్రం ఓటేసిన జనానికే చికాకుగా ఉంటుందని టీడీపీ అంచనా కడుతోంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వారం వారం కోర్టు గడప తొక్కుతుంటే అంతకు మించిన సాక్ష్యం వేరే ఏముంటుంది, ఆ మీదట తాము చేసే విమర్శలకు జన హృదయాలు భగ్గుమని మండితే చాలు అందులో చలి కాచుకోవచ్చునన్నదే టీడీపీ వ్యూహం. జగన్ కి సీబీఐ ట్రయల్ కోర్టు షాక్ ఇవ్వడాన్ని టీడీపీ ఓ పెద్ద పండుగలాగ చేసుకుంటోంది. జగన్ జైలుకే పోతాడని సీనియర్ మంత్రి యనమల రామక్రిష్ణుడు లాంటి వారు జోస్యాలు చెబుతూంటే వైసీపీలో కొత్త సీఎం విజయసాయిరెడ్డి అంటున్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న. మొత్తానికి చిరిగి చాట చేసేందుకు టీడీపీకి ఇపుడు జగన్ అడ్డంగా దొరొకేశాడనే అనుకోవాలి.పరుగుపందెంలో ముందు పరిగెడితేనే గెలుపు కాదు, పోటీదారు కళ్ళకు అడ్డం పెట్టి పడగొట్టినా గెలుపే. రాజకీయాల్లో ఇపుడు ఇదే అసలైన నీతి. ఇదే విజయ సూత్రం కూడా. అందువల్లనే టీడీపీ ఎటూ తన ఇమేజ్ పెంచుకోలేకపోతోంది. తన సైజ్ ఎక్కడా పెరిగే సూచనలు కూడా కనుచూపు మేరలో లేవు. దాంతో బలమైన శత్రువు బలహీనుడు కావాలనే తెలివైన రాజకీయ నేత కోరుకుంటారు. దీవించినట్లుగా అదే జరిగితే పట్టరాని పసుపు పార్టీకి సంతోషమే కదా. ఇక జగన్ విషయానికే వస్తే అప్రతిహతమైన విజయం దక్కడంతో రాజకీయాల్లో మధ్యాహ్న మార్తాండుడులా దూసుకుపోతున్నారు. ఆయన్ని ఇప్పట్లో కొట్టడం కష్టమనుకున్న వారికి సీబీఐ తీర్పు నెత్తిన పాలే పోసిందంటున్నారు