రవాణలో సికింద్రాబాద్ జోన్ టాప్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రవాణలో సికింద్రాబాద్ జోన్ టాప్

హైద్రాబాద్, నవంబర్ 11, (way2newstv.com)
రైల్వే సరుకుల రవాణాలో గణనీయమైన ఆదాయం తెచ్చిపెడుతున్న దక్షణ మధ్య రైల్వే  మరోసారి తన ఆధిక్యతను చాటుకుంది. దేశంలోని అన్ని జోన్ల కంటే అత్యధికంగా సౌత్ సెంట్రల్ రైల్వే రోజూ సగటున 30 శాతం వృద్ధిని సాధించి ప్రథమ స్థానం దక్కించుకుంది. గత నెలాఖరుకి సరుకుల రవాణాలో ఇతర జోన్ల కంటే సికింద్రాబాద్ డివిజన్ భారీగా ఆదాయాన్ని పెంచుకుని రికార్డు సృష్టించింది.రోజూ 4,485 వ్యాగన్లతో సరుకు రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 4, 985 వ్యాగన్ల సరుకును రవాణా చేసి తన లక్ష్యాన్ని తానే అధిగమించింది. రోజూ 460 వ్యాగన్ల సరుకును అధికంగా సరఫరా చేసింది. 
రవాణలో సికింద్రాబాద్ జోన్ టాప్

సరుకు రవాణాకు సంబంధించి వినియోగదారులను సంతృప్తి పరిచేందుకు రైల్వే శాఖ తీవ్రమైన కృషి చేసింది. గత నెలలో దక్షిణ మధ్య రైల్వే 9, 952 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేసింది. ఇలాంటి ఆధిక్యత గతంలో ఎన్నడూలేదని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించుకుంది. 2017 అక్టోబర్ 7, 565 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో పోలిస్తే 2, 387 మిలియన్ టన్నుల సరుకులను అధికంగా చేరవేసింది. ఈ ఏడాది బొగ్గు 37 శాతం, ఇనుప ఖనిజం ఎగుమతితో 190 శాతం, సిమెంట్ ఎగుమతిలో 16 శాతం, ఆహార ధాన్యాలు ఎగుమతి 18 శాతం, ఎరువులు సరఫరాలో 6.7 శాతం, కంటైనర్ ద్వారా 34 శాతం సరకులను రవాణా చేసింది. 2018-2019 సంవత్సరంలో 68.243 మిలియన్ టన్నుల సరుకును సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా అదనంగా 12.383 మిలియన్ టన్నులు రవాణా చేసింది. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో 55,860 మిలియన్ టన్నులు లక్ష్యంగా పెట్టుకోగా 58,263 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు