కామారెడ్డి నవంబర్ 7 (way2newstv.com)
కామారెడ్డి జిల్లా లోని ఎల్లారెడ్డి, నిజాంసాగర్ మండలాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సంయుక్త కలెక్టర్ యాదిరెడ్డి ఈరోజు పరిశీలించారు. ఎల్లారెడ్డి మండలం లోని తిమ్మారెడ్డి, నిజాంసాగర్ మండలం లోని మాగి, గోర్గల్ గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదని రైతులు సంయుక్త కలెక్టర్ కు వివరించారు,
వరి” ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సంయుక్త కలెక్టర్
అనంతరం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయిస్తున్న రైతులు వారి వారి ఆధార్ కార్డులు, మరియు బ్యాంకు ఖాతాలను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని సూచించారు. నీ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాలుకు 1835 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 1815 రూపాయలుగా ప్రభుత్వం ధరను నిర్ణయించిందని అన్నారు.. విక్రయించిన వారం రోజుల్లోగ వారి వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపినారు. ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండల నాయకులు దుర్గా రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ మోహన్ రెడ్డి, పిట్లం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్, మాజీ సర్పంచ్ అంజయ్య తో పాటు రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.