యాదాద్రి నవంబర్ 1 (way2newstv.com)
తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశాం. పారిశ్రామిక విధానంలో టీఎస్ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం దండుమల్కాపూర్లో టీఎస్ఐఐసీ-టీఐఎఫ్-ఎమ్మెస్ఎంఈ-గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును అయన సహచర మంత్రి జగదీష్ రెడ్డితో కలసి ప్రారంభించారు. అంతకుముందు అయన పారిశ్రామికవేత్తలతోముఖాముఖి మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ పరిశ్రమల విషయంలో తెలంగాణ అనుసరిస్తోన్న విధానం రేపు దేశంలోని అన్ని రాష్ర్టాలకు రోల్మోడల్ అవుతుంది. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా నిలబడుతోంది.
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
70 శాతం ఉద్యోగాలు ఇచ్చేది ఎంఎస్ఎంఈ పరిశ్రమలే. ఎంఎస్ఎంఈకి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నామని చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా 12 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. మాది తెలంగాణ అని సగర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చామన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని అయన అన్నారు.ఈ గ్రీన్ఇండస్ట్రియల్ పార్కును పర్యావరణహితంగా ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. పార్క్ విస్తరణకు అవసరమైన భూసేకరణకు చర్యలు చేపడాతామని అన్నారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును 2వేల ఎకరాలకు విస్తరిస్తాం.. గ్రీన్ఇండస్ట్రీకి మాత్రమే ఇందులో పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జగదీశ్ రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్సీలు, కర్నే ప్రభాకర్, ఎమ్మెల్యేలు గొంగిడి సునిత, కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, సైది రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags:
telangananews