ప్రపంచం అంతమయ్యేవరకు ఫోటోగ్రఫీ ఉంటుంది: స్పీకర్ తమ్మినేని - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రపంచం అంతమయ్యేవరకు ఫోటోగ్రఫీ ఉంటుంది: స్పీకర్ తమ్మినేని

అమరావతి నవంబర్1 (way2newstv.com)
విజయవాడలోని కల్చరల్ ఆఫ్ సొసైటీలో ఫోటోగ్రాఫర్ జర్నలిస్టుల అవార్డ్స్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొని ఫోటో గ్రాఫర్లకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా స్పీకర్ సీతారాం మాట్లాడుతూ.. ఫోటోగ్రాఫర్స్‌కి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచం అంతమయ్యేవరకు ఫోటోగ్రఫీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. టూరిజం పరంగా విశాఖ రిషికొండని మరింత అభివృద్ధి చేయాలని ప్రత్యేక ప్రణాళిలు రచిస్తున్నట్లు తెలిపారు. 
ప్రపంచం అంతమయ్యేవరకు ఫోటోగ్రఫీ ఉంటుంది: స్పీకర్ తమ్మినేని

వైఎస్‌ జగనమోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం సమయంలో తల్లి కొడుకుల భావోద్వేగాన్ని ఫొటోలో బంధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ..  తానూ ఒక జర్నలిస్ట్ గా పని చేసి ఈ స్థాయికి వచ్చానని గుర్తుచేశారు. ఎక్కడి నుంచి వచ్చినా మన మూలాల్ని మర్చిపోకూడదని, రిపోర్టర్ కష్టం కన్నా ఫోటోగ్రాఫి చాలా కష్టమైన పని అని అన్నారు. మాజీ సీఎం ఎన్టీ రామారావు చనిపోయే సమయంలో తాను జర్నలిస్టుని, ఆ సమయం లో నా కళ్ళల్లో నీటిని ఫోటోలో బంధించారని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్స్ అందరితో కలిసి పని చేసిన తాను.. ఇప్పుడు అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఫోటోల సాక్ష్యం తోనే ఎన్నో కేసులు తీర్పులు ఇవ్వడం జరిగిందనా పేర్కొన్నారు. విజయవాడ నగరం అంతా ఫోటోగ్రాఫర్స్  పై ఆధారపడి ఉందిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు.  ఫోటోగ్రాఫర్స్ కి అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజున ఫోటోగ్రాఫర్ ఫంక్షన్ జరగడం చాలా ఆనందరంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.