ఏపీలో స్వైన్ ఫ్లూ సైరన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో స్వైన్ ఫ్లూ సైరన్

ఒంగోలు, నవంబర్ 2, (way2newstv.com)
స్వైన్ ఫ్లూ వైరస్  వ్యాప్తికి శీతాకాలం అనుకూల వాతావరణం కావటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలలో స్వైన్ ఫ్లూ సీజను ఇదే కావటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. స్వైన్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రచార మాధ్యమాల సాయంతో చైతన్యం తేవాలని ప్రభుత్వం ఆదేశించింది ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి వెళ్లే ప్రజలు ఎక్కువగా ఉంటారని, వలసలు ఉంటాయని ఇందువల్ల స్వైన్ ఫ్లై వ్యాప్తికి అవకాశాలుంటాయని ప్రచారం చేస్తున్నారు. బస్టాండులలో పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా విస్తృత అవగాహన కలిగించాలని సతీశ్ చంద్ర కోరారు. 
ఏపీలో స్వైన్ ఫ్లూ సైరన్

రైల్వే స్టేషన్లలో, జన సమ్మర్థ ప్రదేశాలలో మైకులలో ప్రకటనలను రూపొందించి ప్రసారం చేయాలని సతీశ్ చంద్ర కోరారు. అంగన్ వాడీలు, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో స్వైన్ ఫ్లూపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనం ఎక్కువగా గుమికూడి ఉండే ప్రాంతాలు స్వైన్ ఫ్లూ వ్యాప్తికి తోడ్పడతాయని, ఇందువల్ల దేవాలయాలు, మసీదులు, చర్చిల దగ్గర స్వైన్ ఫ్లూ అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలని సతీశ్ చంద్ర సూచించారు. శుక్రవారాల్లో మసీదుల దగ్గర ముస్లిం సోదరులు ప్రార్థనకు వస్తారని, తిరుమలలో రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని సందర్శిస్తారని, ఇటువంటి పవిత్ర స్థలాలు, ప్రార్థనా ప్రదేశాలలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు తిరుమల, తిరుపతిలో స్వైన్ ఫ్లూ అవగాహనా శిబిరాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. తమ జిల్లాలో స్వైన్ ఫ్లూ వ్యాప్తికి ‘ఆయుష్’ ద్వారా ఔషధాల పంపిణీ చేయనున్నారు. అతి తక్కువ వ్యయంతో కూడిన హోమియో వైద్యం మంచిదేనని, అయితే ముందు జాగ్రత్త చర్యలపై మరింత దృష్టిని కేంద్రీకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు. విస్తృత స్థాయిలో పారిశుధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలని పురపాలక సంఘ అధికారులు, పంచాయతీ అధికారులను ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ఆదేశించారు. స్వైన్ ఫ్లూ మందులతో నయమయ్యే వ్యాధి కావటంతో ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, విజయవాడ, విశాఖ, తిరుపతి విమానాశ్రయాలలో ఇప్పటికే హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశామని, హెల్త్ క్యాంపుల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాలని సతీశ్ చంద్ర జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోలేకపోవటం, జలుబు లక్షణాలతో బాధపడేవారు ఈ సమయంలో స్వైన్ ఫ్లూ పరీక్ష చేయించుకుంటే మంచిదని సూచించారు. స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే చికిత్సకు హెల్త్ క్యాంపులలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఆయన తెలిపారు. బయట ఏటీఎంలు, తలుపు గొళ్లాలు, లిఫ్టు మీటలు, వాడిన వెంటనే వైద్యులు చెబుతున్నట్లుగా వెంటనే కళ్లు, ముక్కు, నోటిని ఆచేతులతో తాకకపోవడం శ్రేయస్కరమన్నారు. స్వైన్ ఫ్లూపై అవగాహనకు, ప్రచార మాధ్యమాల్లో ప్రాచుర్యం కల్పించాలని, సినిమా హాల్స్‌లో స్తైడ్స్, లఘు చిత్రాల ద్వారా ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలు సూచించాలని సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శిని ఆదేశించారు. గత ఏడాదితో పోలిస్తే నమోదువుతున్న స్వైన్ ఫ్లూ కేసులు తక్కువగా ఉన్నా ముందు జాగ్రత్త చర్యలు అవసరమని అన్నారు. హోటళ్లులో, లాడ్జీలలో రిసెప్షన్ కౌంటర్ల దగ్గర స్వైన్ ఫ్లూపై అవగాహన బోర్డులను పెట్టాలని ఆదేశించారు. చేతులు శుభ్రంగా కడుక్కోవటం, ఎక్కువ నీరు తాగటం, నోటికి, ముక్కుకు మాస్కులు ధరించాలనే సూచనలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని సతీశ్ చంద్ర వివరించారు.. ఆస్పత్రులలో స్వైన్ ఫ్లూ కేసుల చికిత్సకు విడిగా 10, 5, 3 పడకలతో ప్రత్యేక  వార్డులను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రత్యేక వార్డులలో కిట్స్, మందులు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలన్నారు. స్వైన్ ఫ్లూ నిరోధానికి, అవగాహనా చైతన్యానికి చంద్రన్న సంచార చికిత్స వాహనాల సేవలు ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. 22 రైల్వే స్టేషన్లలో, 29 బస్ స్టేషన్లలో, మరో 13 జనసమ్మర్థ ప్రదేశాలలో హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. ఆస్పత్రులలో సంబంధిత విభాగాల వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఈ ఏడాది జనవరి 21 నుంచి ఇప్పటిదాకా దేశంలో 8025 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏపీలో 128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.