కుకింగ్ చార్జీల్లో కొరత... పడకేస్తున్న లక్ష్యాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కుకింగ్ చార్జీల్లో కొరత... పడకేస్తున్న లక్ష్యాలు

శ్రీకాకుళం, నవంబర్ 2, (way2newstv.com)
పిల్లలందరినీ సర్కార్‌ బడిబాట పట్టించాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం రోజురోజుకూ నీరుగారుతోంది. చార్జీల్లో కోత విధిస్తే ఇక మీదట బడుల్లో వంటలు చేయలేమని  వాపోతున్నారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల జిల్లాలో 6,158 మంది  మహిళలు తీవ్రంగా నష్టపోనున్నారు. పాలకుల నిర్ణయాలు.. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వంటి కారణాలతో ఈ పథకం గతి తప్పుతోంది. తాజాగా వంట ఏజెన్సీలకు ఇస్తున్న కుకింగ్‌ చార్జీల్లో కూడా కోత వేయాలని సర్కార్‌ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే తాము వంటలు చేయలేమని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
కుకింగ్ చార్జీల్లో కొరత... పడకేస్తున్న లక్ష్యాలు

జిల్లాలో 3,155 సర్కారు విద్యా సంస్థలు ఉండగా వీటిలో 3,154 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలౌతోంది. ఈ ఏడాది 2,38,616 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఒకటి  నుంచి 5వ తరగతి విద్యార్థులు 1,58,096 మంది, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే వారికి మంగళం పలికేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ బాధ్యతను అన్న క్యాంటీన్‌ కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా  కందిపప్పు, వంటనూనె తదితర ముడిసరుకులు సరఫరా చేస్తూ ఆ మేరకు వీరికి ప్రతీ నెలా ఇచ్చే కుక్కింగ్‌ చార్జీల్లో కోత కోయనుంది. ఇప్పటికే అరకొరగా వస్తున్న కుకింగ్‌ చార్జీలు సగానికి తగ్గనుండటంతో వంట ఏజెన్సీ మహిళలు లబోదిబోమంటున్నారు.1,80,520 మంది ఉన్నారు. వీరిలో 95 శాతం మంది మధ్యాహ్న భోజనాన్ని  చేస్తునట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరికి షిఫ్ట్‌ పద్ధతిలో ప్రతీ నెల 6,158 మంది మహిళలు మధ్యాహ్న భోజనాన్ని వండిపెడుతున్నారు. వీరు  తమ సొంత డబ్బులతో వంటలు చేస్తూ నెల పూర్తయిన తర్వాత  ప్రభుత్వం ఇచ్చే కుకింగ్‌ చార్జీలతో నెట్టుకొస్తున్నారు. ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికీ 100 గ్రాముల బియ్యం, మసాలా దినుసులకు రూ.4.13 పైసలు చొప్పున అలాగే 6–10 వతరగతి విద్యార్థులకు 150 గ్రాముల బియ్యం, మసాలా ఖర్చులకు రూ.6.18 పైసలు చొప్పున ఈ మహిళలకు విద్యాశాఖ చెల్లిస్తోంది. తాజాగా ప్రభుత్వం  1–5వ తరగతి వారికి 20 గ్రాముల కందిప్పు, 5 గ్రాముల నూనె, అలాగే 6–10వ తరగతి విద్యార్థులకు 30 గ్రాముల కందిపప్పు, 7.25 గ్రాముల నూనె చొప్పున సరఫరా చేస్తోంది. ఈ సరుకులకు గాను  కుకింగ్‌ చార్జీల్లో 1–5వ తరగతి విద్యార్థులకు రూ.2లు, 6–10వ తరగతి విద్యార్థులకు రూ.3లు కట్‌ చేయనుంది. ఈ లెక్కన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.2.18 పైసలు, 6–10వ తరగతి విద్యార్థులకు రూ.3.18 పైసలు మాత్రమే ఇక మీదట కుకింగ్‌ చార్జీలుగా చెల్లిస్తుంది.కందిపప్పు, నూనె ప్రభుత్వం ఇచ్చినా చింతపండు, ఉల్లి, తెల్లఉల్లి, పసుపు, కారం, ఆవాలు, జీలకర్ర, ఇతర మసాలా దినుసులు, వంట చేసేందుకు గ్యాస్‌ లేదా కట్టెలు మొదలైనవి మహిళలే సమకూర్చుకోవాలి. ప్రస్తుతం ఇస్తున్న చార్జీలే అరకొరగా ఉంటే ముందుముందు వీటిని కూడా తగ్గించడంవల్ల వంట సాధ్యం కాదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.