తణుకు నవంబర్ 20 (way2newstv.com)
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి జిల్లా తణుకు కాకతీయ కల్యాణ మండపంలో పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పలకొల్లు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. తరువాత వైసీపీ ప్రభుత్వ బాధితుల శిబిరంలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ భేటీకి బాధితులు, వారి కుటుంబ సభ్యులు హజరయ్యారు.
మాలలు వేసుకుని..బూతులు తిడుతూ…
చంద్రబాబు మాట్లాడుతూ ప్రశాంతమైన పశ్చిమగోదావరి జిల్లాను ప్రశాంతంగానే ఉండనీయాలని అన్నారు. టీడీపీ కార్యకర్తల బాధ, ఆవేదన చూస్తుంటే కక్షగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. పోలీసులు ఇప్పటికైనా మారాలని, పోస్టింగుల కోసం తప్పుడు కేసులు పెట్టొద్దన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ తప్పుడు కేసులు పెట్టలేదన్నారు. అయ్యప్ప మాలలు వేసుకుని బూతులు తిట్టే పరిస్థితికి వచ్చారని, చివరకు వేంకటేశ్వరస్వామికి సవాల్ కూడా విసురుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు.