హైదరాబాద్ నవంబర్ 20 (way2newstv.com)
తెలంగాణలో ఫారెస్ట్ ప్లస్ 2.0 కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ సహకారంతో జలం - శ్రేయస్సు కోసం అడవులు అనే ధ్యేయంతో ఫారెస్ట్ ప్లస్ 2.0. కార్యక్రమాన్ని మెదక్ అటవీ డివిజన్ పరిధిలో అమలు చేయనున్నారు
తెలంగాణలో ఫారెస్ట్ ప్లస్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
యూఎస్ ఎయిడ్ - కేంద్ర అటవీ పర్యావరణ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో ఫారెస్ట్ ప్లస్ 2.0 అమలు కానుంది అటవీ పునరుజ్జీవనం, అడవుల్లో నీటి వనరుల అభివృద్ధికి యూఎస్ ఎయిడ్ సహకరించనుంది. సోమాజిగూడ ది పార్క్ హోటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూఎస్ ఎయిడ్ ప్రతినిధుల వర్ఘిస్ పాల్, రమొనో, కేంద్ర అటవీ శాఖ ఐజి నోయాల్ థామస్, ఆటవీ శాఖ ప్రధాన కన్సర్వేటర్ అర్. శోభ, అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ ఎండీ రఘువీర్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.