రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ లక్ష్యం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ లక్ష్యం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన ఎమ్మెల్యే
గద్వాల జోగులాంబ నవంబర్ 29  (way2newstv.com)
గద్వాల మండలంలోని పరిధిలో  బస్సు చెరువు గ్రామంలో ఐకేపీ ద్వారా వరి ధాన్యం  కేంద్రాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి  జిల్లా పరిషత్  వైస్ చైర్ పర్సన్  సరోజమ్మ  హజరయ్యారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకు వరి ధాన్యం కొనుగోలు సెంటర్  ఏర్పాటు చేసింది. రైతులు కష్టపడి పండించిన పంటను   నేరుగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐకేపీ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం లో అమ్మడం వల్ల ఏ రోజుకి ఆ రోజు మీ పూర్తి వివరాలను కంప్యూటర్లలో నమోదు చేసుకొని మీకు డబ్బులు త్వరగా వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. 
రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ లక్ష్యం

గత సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం అధిక వర్షపాతం రావడం వల్ల రెండు పంటలకు సరిపడే సరిపోయే తాగునీరు మన ప్రాంతంలో ఉండటం వల్ల ప్రతి ఒక్క రైతుకు రెండు పంటలకు నీరు అందించి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట ఎక్కువ మీరు కరెంటు రైతులకు కు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలనఇ అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు గ్రేట్ ఎ1835/-  , సాధారణ రకం1815 /- తేమా శాతం 17% . నవంబర్ నుంచి జనవరి వరకు ఏ సమయంలో అయినా రైతులు పంట చేతికి వచ్చి ధాన్యమును మార్కెట్లోకి తీసుకు రావడం జరుగుతుందని అన్నారు. ⚡  గత సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం వరి ధాన్యము ఎక్కువ శాతం మన ప్రాంతంలో పండించడం చేయడం జరిగినది.   రెండు పంటకు కూడా రైతులకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించే విధంగా కృషి చేయడంజరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారుఈ కార్యక్రమం లో ఆయన వెంట గద్వాల మండలం ఎంపీపీ ప్రతాప్ గౌడ్, గట్టు మండలం ఎంపీపీ విజయ్, కె.టి దొడ్డ మండలం జెడ్ పి టి సి రాజశేఖర్,    జిల్లా రైతు సమన్వయం సమితి అధ్యక్షుడు చెన్నయ్య, సర్పంచ్ హరిత నరసింహారెడ్డి     ఉప సర్పంచ్,    తెరాస పార్టీ మండలం పార్టీ అధ్యక్షుడు రమేష్ నాయుడు తెరాస పార్టీ నాయకులు  గద్వాల  Ri,  గ్రామ ఐకెపి సిబ్బంది, నాయకులు కార్యకర్తలు రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు