విజయవాడ నవంబర్ 29 (way2newstv.com)
పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ఉదయం సింగ్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో పర్యటించారు. యార్డు తరలింపు, అభివృద్ధికి కమిషనర్ ప్రసన్న కుమార్ కు సూచనలు చేసారు. తరువాత మంత్రి మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో వాంబే కాలనీ డంపింగ్ యార్డు ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నాం.
సింగ్ నగర్ లో మంత్రి బోత్స పర్యటన
ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని డంపింగ్ యార్డు ను తరలించి ఈ ప్రాంతంలో పార్క్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డు ను గుంటూరు కు తరలించే యోచన లో ఉన్నాం. వాంబే కాలనీ, సింగ్ నగర్ ప్రాంతావాసులు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారి సమస్య కు శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు.
Tags:
Andrapradeshnews