ఆర్.ఆర్.ఆర్ మూవీలో విలన్ గా హాలీవుడ్ లేడీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆర్.ఆర్.ఆర్ మూవీలో విలన్ గా హాలీవుడ్ లేడీ

హైద్రాబాద్, నవంబర్ 20  (way2newstv.com)
 ‘ఆర్ ఆర్ ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతానికి 70 శాతం షూటింగ్ అయిపోయినట్లు చిత్ర వర్గాలు నిన్నే ప్రకటించింది. అయితే ఇందులో తారక్‌కు జోడీగా నటించేబోయే పాత్ర గురించి, విలన్‌ పాత్రకు సంబంధించిన వివరాలను ఈరోజు ప్రకటించనున్నట్లు తెలిపింది.ఈ నేపథ్యంలో తారక్ హీరోయిన్, విలన్ వీళ్లేనంటూ ఇద్దరు భామల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో తారక్‌కు జోడీగా ఒలీవియా అనే విదేశీ అమ్మాయిని ఎంపిక చేసుకున్నారట. మొదట్లో డైసీ ఎగ్డార్‌జోన్స్ అనే బ్రిటన్ నటిని ఎంపిక చేసుకున్నారు. కానీ సినిమా షూటింగ్ మొదలు కాకుండానే ఆమె సినిమా నుంచి తప్పుకుంది. 
ఆర్.ఆర్.ఆర్ మూవీలో విలన్ గా హాలీవుడ్ లేడీ

అప్పటి నుంచి రాజమౌళి ఎన్టీఆర్ భార్య పాత్రలో ఎవర్ని తీసుకుంటే బాగుంటుందా అని చాలా ఆలోచించారు. ఇకపోతే ఇందులో ఐర్లాండ్‌కు చెందిన నటి ఆలిసన్ డూడీ అనే 53 ఏళ్ల హాట్ బ్యూటీని విలన్‌గా ఎంపిక చేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆలిసన్ ‘ఇండియానా జోన్స్’, ‘ది లాస్ట్ క్రుసేడ్’, ‘కింగ్ సోలోమాన్స్ మైన్స్’, ‘డివిజన్ 19’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో న నటించారు.ఆమైతే సినిమాలో విలన్‌గా సరిపోతారని భావించిన రాజమౌళి తనను పిలిపించి ఆడిషన్ కూడా చేశారట. ఆలిసన్ స్క్రీన్ ప్రెసెన్స్‌ రాజమౌళికి చాలా నచ్చిందట. ఆమెతో పాటు ఐర్లాండ్‌కు చెందిన రేమండ్ స్టీవెన్సన్ అనే మరో నటుడ్ని విలన్‌గా చూపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఇంకొద్ది సేపు ఆగాల్సిందే. ఈ సస్పెన్స్‌కు ‘ఆర్ ఆర్ ఆర్’ టీం ఈరోజు తెర దించనుంది. ఇకపోతే రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు 300 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2020 జులై 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.