జ్యోతిబా పూలేకు ఘనంగా నివాళి అర్పించిన గవర్నర్ బిశ్వ భూషణ్

విజయవాడ, నవంబర్ 28  (way2newstv.com)
సమానత్వం, సమ న్యాయం ప్రాతిపదికన జ్యోతిబా పూలే ఉద్యమించారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్  హరిచందన్ అన్నారు.  గొప్ప సామాజిక సంస్కర్తగా అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడటమే కాక, మహిళల విముక్తి కోసం సామాజిక ఉద్యమాలు నడిపారని ప్రస్తుతించారు. విజయవాడ రాజ్‌భవన్‌ దర్బార్ హాల్‌లో గురువారం జయంతిబా పూలే వర్ధంతిని పురస్కరించుకుని గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ ఘనంగా నివాళి అర్పించారు. 
జ్యోతిబా పూలేకు ఘనంగా నివాళి అర్పించిన గవర్నర్ బిశ్వ భూషణ్

 ఈ సందర్భంగా గవర్నర్ సందేశం ఇస్తూ జ్యోతిబా పులేను నాటి రోజుల్లో ఉన్నత కులాల ప్రజలు వ్యతిరేకించారని, కాని ఆయన తాను నమ్మిన ఆదర్శాలు, సూత్రాలపై గట్టిగా నిలబడ్డారని పేర్కొన్నారు.  తన జీవితం గురించి పట్టించుకోకుండా సిద్దాంత ప్రాతిపదికన పోరాటాన్ని కొనసాగించారని గవర్నర్ అన్నారు. గొప్ప నాయకుడిగా, సామాజిక సంస్కర్తగా ప్రజలలో నిలిచిన పూలేను  ఆయన వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకోవటం గౌరవమన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసిన గవర్నర్,  జ్యోతిబా పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్ భవన్  సంయిక్త కార్యదర్శి అర్జునరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Previous Post Next Post