కేంద్రం దృష్టికి ఆర్టీసీ సమ్మె - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేంద్రం దృష్టికి ఆర్టీసీ సమ్మె

న్యూ ఢిల్లీ నవంబర్ 21 (way2newstv.com)
తెలంగాణ లో జరుగుతోన్న ఆర్టీసి సమ్మెను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి వివరించామని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి వెల్లడించారు. ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావు ల తో కలిసి విజయ్ చౌక్ లో మీడియా తో మాట్లాడారు.ఇప్పటికే 28 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని వారి కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వెంటనే ఆర్టీసీ కార్మికులు భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఆర్టీసీ లో కేంద్రం వాటా కూడా ఉందని, రాష్ట్ర రవాణా శాఖ అధికారుల తో వెంటనే మాట్లాడుతా అని గడ్కరీ చెప్పినట్టు వెల్లడించారు. 
కేంద్రం దృష్టికి ఆర్టీసీ సమ్మె

అందరం కలిసి తెచ్చుకున్న తెలంగాణ లో కేసీఆర్ దొరతనం మానేయ్యాలని హితవు పలికారు.ఇక తెలంగాణ రాష్ట్రం లో కాలుష్యం మీద తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ అర్వింద్ తీవ్రంగా ఖండించారు. హుస్సేన్ సాగర్, పెద్ద చెరువు, బాలానగర్ చెరువులు పూర్తివా కలుషితం అయ్యాయాని, ఫ్యాక్టరీ ల నుండి వచ్చే రసాయనాలు, పొగ తో ప్రజలు జబ్బులకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కోతులకు పార్క్ కట్టలేదని, సీఎం ఫార్మ్ హౌస్ చూసి అదే కోతుల పార్క్ అనుకుంటున్నారని అర్వింద్ ఎద్దేవా చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రజలు వినతులు ఇచ్చినా కూడా కేటీఆర్ ఎక్కడ స్పందించలేదన్నారు. నామా నాగేశ్వరరావు తమ వ్యాపారాల కోసం పార్లమెంట్ లో కేసీఆర్ భజన చేయొద్దని ఎంపీ అర్వింద్ హితవు పలికారు.