సిటీలో రెడ్, ఆరెంజ్ పరిశ్రమలు 1125 - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిటీలో రెడ్, ఆరెంజ్ పరిశ్రమలు 1125

తరలింపు కోసం మార్చి 31 వరకు డెడ్ లైన్
హైద్రాబాద్, డిసెంబర్ 2 (way2newstv.com)
కాలుష్యం వెదజల్లే ఆరెంజ్, రెడ్ కంపెనీలను 2020 మార్చి 31లోగా ఔటర్ అవతలికి తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసి పరిధిలో కాలుష్య కారక కంపెనీలు ఎక్కువగా ఉండగా అందులో రెడ్, ఆరెంజ్ కేటగిరీల కింద 1,125 పరిశ్రమలు ఉన్నాయని ఇందులో కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలను ముందుగా తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా వాటిని ఔటర్ అవతలకు తరలించాలని, దీనికోసం ప్రత్యామ్నాయాన్ని చూపినా చాలా పరిశ్రమలను తరలించడానికి ఆయా పరిశ్రమల యజమానులు ముందుకురావడం లేదని టిఎస్‌ఐఐసి అధికారులు పేర్కొంటున్నారు. 
సిటీలో రెడ్, ఆరెంజ్ పరిశ్రమలు 1125

ఇప్పటికే పరిశ్రమల శాఖ ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపల ఎంపిక చేసిన పారిశ్రామికవాడలకు కాలుష్య కారక పరిశ్రమలను తరలించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే దీనికి సంబంధించి పిసిబి అధికారులు పలు కంపెనీలకు నోటీసులు అందచేసినట్టుగా సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి పరిధిలో సుమారు 2వేలకు పైగా కాలుష్య పరిశ్రమలున్నాయని పిసిబి గణాంకాలు పేర్కొంటున్నాయి. వీటిలో ఇప్పటికే కాలుష్యం వెదజల్లే 300 పరిశ్రమలను ఔటర్ అవతలి వైపునకు తరలించినట్టుగా అధికారులు పేర్కొంటున్నారు.అయితే మిగిలిన పరిశ్రమలు కూడా ఔటర్ వైపునకు వెళ్లాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా పరిశ్రమల యజమానులు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని పిసిబి అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే కాలుష్యాన్ని వెదజల్లే పారిశ్రామికవాడలు ఎక్కువగా జీహెచ్‌ఎంసి పరిధిలో ఉన్నాయని పిసిబి అధికారులు పేర్కొంటున్నారు.మూడుదశాబ్దాల క్రితం నగరాన్ని ఆనుకొని అనేక ప్రాంతాలు ఉండేవి. వేగంగా జరిగిన పట్టణీకరణతో అవి హైదరాబాద్‌లో అంతర్భాగం అయ్యాయి. ఒకప్పుడు నగర శివారుగా ఉన్న సనత్‌నగర్, జీడిమెట్ల, పటాన్‌చెరు, బొల్లారం, బాలానగర్, జీడిమెట్ల, కాటేదాన్, ఉప్పల్, కూకట్‌పల్లి, నాచారం, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లోని పారిశ్రామికవాడలు జీహెచ్‌ఎంసిలో అంతర్భాగమ య్యా యి. పొల్యూషన్ ఇండెక్స్ ఆధారంగా ఈ పరిశ్రమలను ఆరెంజ్, రెడ్, గ్రీన్ కేటగిరీలుగా పిసిబి వర్గీకరించింది. పొల్యూషన్ ఇండెక్స్‌లో 60కి పైగా స్కోర్ ఉండే పరిశ్రమలను రెడ్ కేటగిరీగా, 41 నుంచి 59 శాతం స్కోర్ పరిశ్రమలను ఆరెంజ్ కేటగిరీగా పిసిబి వర్గీకరించింది.సరిగ్గా 6 సంవత్సరాల క్రితం ఆరెంజ్ కేటగిరీలో ఉన్న 1,125 పరిశ్రమలను ఓఆర్‌ఆర్ వెలుపలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమల తరలింపునకు వీలుగా ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపల తొమ్మిది ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయడానికి పరిశ్రమల శాఖ ఏర్పాట్లను చేస్తోంది. రెడ్, ఆరెంజ్ కేటగిరీల్లో ఉన్న సుమారు 500 బల్క్ డ్రగ్ పరిశ్రమలను దశలవారీగా ముచ్చర్లలోని ఫార్మాసిటీకి తరలించేందుకు ప్రణాళికను సిద్ధంచేశారు.