5300 కోట్లకు చేరిన ఆర్టీసీ నష్టాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

5300 కోట్లకు చేరిన ఆర్టీసీ నష్టాలు

హైద్రాబాద్, డిసెంబర్ 2, (way2newstv.com)
ఆర్టీసీకి 2019 అక్టోబర్‌‌‌‌ 8 వరకు రూ.5,269.25 కోట్ల నష్టాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్‌‌‌‌ 21 వరకు సంస్థ రూ.2,958.57 కోట్ల రుణాలు తీసుకుందని, ఇందులో ప్రభుత్వ రుణాలు రూ.845.09 కోట్లు ఉన్నాయని తెలిపింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా ఆర్టీసీకి ప్రభుత్వం రూ.4,239.95 కోట్ల సాయం చేసిందని, అందులో సర్కార్‌‌‌‌ నేరుగా రూ.3,903.55 కోట్లు, జీహెచ్‌‌‌‌ఎంసీ రూ.336.40 కోట్లు ఇచ్చిందని పేర్కొంది. ఆర్టీసీ నష్టాలు, బస్సుల వివరాలు, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగులు తదితర విషయాలను పొందుపరిచింది.1932 జూన్‌‌‌‌ 5న హైదరాబాద్‌‌‌‌ రాష్ట్రంలో నిజాం స్టేట్‌‌‌‌ రైల్వే అండ్‌‌‌‌ రోడ్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌గా రూ.3.5 లక్షల పెట్టుబడితో 27 బస్సులు, 166 మంది ఉద్యోగులతో ప్రారంభమైంది. 
5300 కోట్లకు చేరిన ఆర్టీసీ నష్టాలు

1958లో ఏపీఎస్‌‌‌‌ ఆర్టీసీగా ఏర్పడింది. 2015 జూన్‌‌‌‌ 3 నుంచి టీఎస్‌‌‌‌ ఆర్టీసీ, ఏపీఎస్‌‌‌‌ఆర్టీసీ ప్రత్యేక సంస్థలుగా పనులు ప్రారంభించాయి. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీలో 97 డిపోల ద్వారా బస్సులు నడుస్తున్నాయి. గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ జోన్‌‌‌‌లో 29 డిపోలు, మిగతా జిల్లాల్లో 68 డిపోలు ఉన్నాయి. 11 రీజియన్లు ఉన్నాయి. సంస్థ నిర్వహణ కార్పొరేషన్‌‌‌‌ బోర్డు, చైర్మన్‌‌‌‌ నేతృత్వంలో ఉంటుంది. మొత్తం 10,460 బస్సులు ఉండగా, ఇందులో 8,357 ఆర్టీసీ బస్సులు, 2,103 హైర్‌‌‌‌ బస్సులు ఉన్నాయి. జిల్లాల్లో 6,622 బస్సులు, సిటీలో 3,838 బస్సులు నడుస్తున్నాయి. ఆర్టీసీ నిత్యం 35 లక్షల కిలోమీటర్లు దూరం బస్సులు నడుపుతూ, 95 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంది. ప్రతి రోజు సగటున రూ.11 కోట్ల టికెట్ల ఆదాయాన్ని పొందుతోంది. 74 శాతం గ్రామీణ ప్రాంతాల్లో, 26 శాతం నగర ప్రాంతాల్లో బస్సులు తిరుగుతున్నాయి.2019 నవంబర్‌‌‌‌ నాటికి ఆర్టీసీ వివిధ వర్గాలకు రూ.2,209.66 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈపీఎఫ్‌‌‌‌కు రూ.788.30 కోట్లు ఇవ్వాలి. ఇందులో ఉద్యోగుల వాటా రూ.332.31 కోట్లు, సంస్థ వాటా రూ.455.99 కోట్లు. ఆర్టీసీ క్రెడిట్‌‌‌‌ కోఆపరేటివ్‌‌‌‌ సొసైటీకి (సీసీఎస్‌‌‌‌) రూ.500.95 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆర్టీసీ థ్రిప్ట్‌‌‌‌ అండ్‌‌‌‌ క్రెడిట్‌‌‌‌ కోఆపరేటివ్‌‌‌‌ సొసైటీ లిమిటెడ్‌‌‌‌కు రూ.200 కోట్లను ఆరు వారాల వ్యవధిలో చెల్లించాలని హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల వాటాగా రూ.332.31 కోట్లు వెంటనే చెల్లించాలని పీఎఫ్ అధికారులు ఆదేశించారు. డబ్బులు చెల్లించకుంటే ప్రాసిక్యూషన్‌‌‌‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిబంధన ప్రకారం ఒక బస్సు జీవితకాలం పూర్తయిన తర్వాత దాని స్థానంలో కొత్త బస్సులను తేవాల్సి ఉంటుంది. 2019లో 2,885 బస్సులు తీసేయాల్సి ఉండగా, వీటి రిప్లేస్‌‌‌‌ మెంట్‌‌‌‌ కోసం రూ.865.50 కోట్లు అవసరం అవుతాయి. 2020లో 605 బస్సులు మార్చాల్సి ఉండగా, దానికి రూ.181.50 కోట్లు కావాలి. 2029 నాటికి సంస్థలో 8,352 కాలంచెల్లిన బస్సులు తొలగిపోతాయి. వాటి కోసం రూ.2,507 కోట్లు కావాలి. ఉద్యోగులకు ఇచ్చిన బాండ్ల విలువ వడ్డీతో కలిపి నవంబర్‌‌‌‌ 2024 నాటికి రూ.2,784.30 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది