ఐపీఎల్ వేలంలో 15 ఏళ్ల చిచ్చరపిడుగు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఐపీఎల్ వేలంలో 15 ఏళ్ల చిచ్చరపిడుగు

ముంబై, డిసెంబర్ 14  (way2newstv.com)
ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అఫ్గానిస్తాన్‌కు చెందిన 15 ఏళ్ల నూర్ అహ్మద్‌కు చోటు దక్కింది. ఐపీఎల్ వేలం ఈనెల 19న కోల్‌కతాలో జరుగుతుంది. ఈ వేలానికి గాను దాదాపు 900లకుపైగా ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. అందులో కేవలం 332 మంది మాత్రమే మిగిలారు. అందులో 15 ఏల్ల నూర్‌కు చోటు దక్కడం విశేషం. తను రూ.20 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి రానున్నాడు.ఇటీవల భారత అండర్-19 జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో నూర్ పేరు తెరమీదకు వచ్చింది. ఆ సిరీస్‌లో అఫ్గాన్ 2-3తో ఓడిపోయినా నూర్ ప్రదర్శన ఆకట్టుకుంది. 
ఐపీఎల్ వేలంలో 15 ఏళ్ల చిచ్చరపిడుగు

లెఫ్టార్మ్ చైనామన్ బౌలరైన నూర్ ఈ సిరీస్‌లో తొమ్మిది వికెట్లతో సత్తాచాటాడు. అపార ప్రతిభ ఉన్న నూర్‌లాంటి ఆటగాళ్లను ఐపీఎల్ వేదికగా మారడం గతంలో ఎన్నోసార్లు చూశాం. ఈక్రమంలో ఈసారి తనను దక్కించుకునేందుకు ఐపీఎల్ జట్లు ప్రయత్నించే అవకాశాలున్నాయి.ఇక వేలానికి అర్హత సాధించిన 332 మంది ఆటగాళ్లలో 186 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. మరోవైపు 143 మంది విదేశీప్లేయర్లు కాగా, ముగ్గురు ఐసీసీ అనుబంధ దేశాలకు చెందిన వారు. ఇక అఫ్గాన్ నుంచి నూర్‌తో సహా ఏడుగురు ఐపీఎల్ వేలంలో చోటు దక్కించుకున్నారు. వారిలో మహ్మద్ షెజాద్, జహీర్ ఖాన్, కరీమ్ జనత్, వకార్ సలామ్ ఖెయిల్, ఖాయిస్ అహ్మద్, నవీనుల్ హక్ ఉన్నారు. గతంలో రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబుర్రహ్మన్ లాంటి అఫ్గాన్‌లు ఐపీఎల్‌లో సత్తాచాటిన సంగతి తెలిసిందే వారి దారిలోనే నూర్ కూడా తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నాడు