ముంబై, డిసెంబర్ 31 (way2newstv.com)
12 ఏళ్లుగా అందరినీ అలరిస్తున్న ఐపీఎల్ 13వ ఎడిషన్ ఎప్పుడు ప్రారంభంకానుందనే దానిపై ఊహగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పటికైతే అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ కథనం ప్రకారం వచ్చే మార్చి 29 నుంచి ఐపీఎల్ ప్రారంభంకానుందని తెలుస్తోంది. అయితే ప్రారంభ సమయంలో పలు సిరీస్‌లు ఉండడంతో నాలుగు దేశాల క్రికెటర్లు అందుబాటులో ఉండరని ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ అన్నట్లు తెలిపింది.మార్చి 29 నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతుండగా.. అదేరోజు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతుందని తెలుస్తోంది.
మార్చి 29 నుంచి ఐపీఎల్
టోర్నీ ప్రారంభ తేదీలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్, శ్రీలంక-ఇంగ్లాండ్ మధ్య సిరీస్‌లు జరుగుతుండడంతో ఈ నాలుగు దేశాలకు చెందిన ప్లేయర్లు హాజరుకావడం సందేహమేనని ఐపీఎల్ జట్టు ఢిల్లీ వ్యాఖ్యనించినట్లు తెలుస్తోంది.ఈక్రమంలోనే ఐపీఎల్‌ను ఏప్రిల్‌లో ప్రారంభించాలని ఇప్పటికే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను రిక్వెస్ట్ చేశాయి. మరోవైపు గతంలో మాదిరిగానే టోర్నీ అంతటా ప్రతిరోజు రెండు మ్యాచ్‌లను నిర్వహించాలని కొన్ని ఫ్రాంచైజీలు అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది ఎడిషన్‌కు సంబంధించి ఇప్పటికే వేలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు ప్యాట్ కమిన్స్ (రూ.15.50 కోట్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ.10.75 కోట్లు) అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లుగా నిలిచారు.