అమోజాన్ సంస్థలో ఘటన
హైదరాబాద్ డిసెంబర్ 5 (way2newstv.com)
అమెజాన్ కంపెనీ ఉద్యోగి పై సహఉద్యోగి దాడి చేసాడు. దాంతో బాధితుడు శివరాం తీవ్ర గాయాలతో కోమాలో వెళ్లాడు. కార్యాలయంలోనే ఈ ఘడన జరిగింది. గాయాపడిన శివరాం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కోమాలో బాధితుడు శివరాం వున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
సహ ఉద్యోగిపై దాడి…కోమాలో బాధితుడు
దాడి చేసిన మునీర్ పై గోల్కొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. మునీర్ ను అరెస్ట్ చేసిని పోలీసులు అతడ్ని బెయిల్ పై వెంటనె వదిలేసారని బంధువుల ఆరోపణ. శివరాం కు అమెజాన్ కంపెనీ చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేసారు. మునీర్ ని ఉద్యోగం నుండి తొలగించి, అతని పై చర్యలు తీసుకొని కఠినగం శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరారు. దాడికి కారణాలు ఇంకా తెలియరాలేదు