బెంగళూరు డిసెంబర్ 5 (way2newstv.com)
కర్ణాటకలో 15 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన 17 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో వారిపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో 15 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అతానీ, కాగ్వాద్, గోకక్, ఎల్లాపూర, హిరికెరూర్, రాణిబెన్నూర్, విజయనగర, చిక్ బళ్లాపుర, హోస్కేటే, కేఆర్ పేట, హున్సూర్, మహాలక్ష్మీ లేఅవుట్, కేఆర్ పురం, శివాజీనగర్, యశ్వంత్ పూర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ పోలీసుల భారీ బందోబస్తు మధ్య సాగింది.
కర్నాటకలో ఉప ఎన్నికలు ప్రశాంతం
మిగతా రెండు మస్కీ, రాజరాజేశ్వరి నియోజకవర్గాలకు సంబంధించి కోర్టులో కేసులున్నా యి. 15 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ సందర్భంగా కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్ల సందడి మొదలైంది. చలి తీవ్రత కాస్తా ఎక్కువగా ఉన్నా ఆరంభంలోనే ఓటు వేసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. బరిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు కొందరు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉప ఎన్నికల సందర్భంగా బెంగళూరు పోలీసు కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ ను అమలు చేసారు. 323 ఫ్లైయింగ్ స్క్వాడ్, 578 పోలీసు బృందాలు బందోబస్తు నిర్వహించాయి.