న్యూఢిల్లీ, డిసెంబర్ 20, (way2newstv.com)
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో నగరంలోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రపతికి ఆహ్వానం పలికేందుకు గవర్నర్ తమిళిసై సహా సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి, తలసాని తదితరులు విమానాశ్రయానికి చేరుకున్నారు.ఈ నెల 28 వరకూ ఆయన శీతకాల విడిదిలోనే ఉండనున్నారు. 22 వరకూ హైదరాబాద్‌లోనే బస చేస్తారు. 23న తిరువనంతపురం పర్యటనకు వెళ్లనున్నారు.
శీతాకాల విడిదికి రాష్ట్రపతి
27న బొలారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తారు. 28 మధ్యాహ్నం తర్వాతి నుంచి రాష్ట్రపతి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో బొలారంలోని రాష్ట్రపతి నిలయాన్ని గవర్నర్ తమిళిసై గురువారం సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి పర్యవేక్షించారు. కోవింద్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం గవర్నర్ విందు ఇవ్వనున్నారు.శీతకాల విడిది కోసం రాష్ట్రపతి కోవింద్ హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఏటా ఈ సీజన్‌లో భారత రాష్ట్రపతి శీతకాల విడిది కోసం హైదరాబాద్‌కు రావడం ఆనవాయితీగా వస్తోంది. దేశ ప్రథమ పౌరుడి విడిది కోసం దక్షిణాది మొత్తంలో హైదరాబాద్‌లోని బొలారంలో రాష్ట్రపతి నిలయం ఉంది.