రెట్టింపు ధరలకు మాంసం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రెట్టింపు ధరలకు మాంసం

నెల్లూరు, డిసెంబర్ 31 (way2newstv.com)
పండుగుల రోజుల్లో చికెన్‌ ధరలు అమాంతంగా పెరగడంతో నగరంలోని మాంసం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. స్కిన్‌ లెస్‌ చికెన్‌ కిలో రూ. 200కు చేరింది. వారం రోజులుగా ఇదే ధర కొనసాగుతోంది. డిసెంబర్‌ 1న కిలో స్కిన్‌ లెస్‌ చికెన్‌ ధర రూ. 160 మాత్రమే. దాదాపు నెల రోజుల క్రితంతో పోలిస్తే కిలోకి రూ. 40 పెరిగింది. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల నాటికి దీని దర మరి కాస్త పెరిగే వీలుందని బ్యాగ్‌ నిర్వాహాకుడు డి ఆదినారాయణ తెలిపారు. కోళ్ల ధాణాగా ఉపయోగించే మొక్కజొన్న ధర పెరగడం, చలి తీవ్రత, పండగలు కారణంగా చికెన్‌ ధరలు పెరిగటానికి కారణాలుగా ఆయన చెప్పారు. గత ఏడాది కూడా క్రిస్మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి రోజల్లో కిలో రూ. 200గా అమ్మకాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. 
రెట్టింపు ధరలకు మాంసం

పండగలు, చలి కారణంగా చికెన్‌ వినియోగం అధికంగా ఉంటుందన్నారు. సంక్రాంతి తర్వాత ధరలు తగ్గే వీలుందన్నారు.చికెన్‌ డిసెంబర్‌ 1న లైవ్‌ కిలో రూ. 77, డ్రెస్‌డ్‌ రూ. 99, స్కిన్‌ లెస్‌ రూ. 160, ధర ఉండగా 8న లైవ్‌ రూ. 90, డ్రెస్‌డ్‌ రూ. 150, స్కిన్‌లెస్‌ రూ. 160గా ఉంది. 15న లైవ్‌ రూ. 92, డ్రెస్‌డ్‌ రూ. 154, స్కిన్‌లెస్‌ రూ. 170 ఉండగా, 22న లైవ్‌ రూ. 108, డ్రెస్‌డ్‌ రూ. 157, స్కిన్‌లెస్‌ రూ. 178గా ఉంది. 24వ తేదీ నాటికి ఒక్కసారిగా చికెన్‌ ధరలు బాగా పెరిగాయి. లైవ్‌ రూ. 122, డ్రెస్‌డ్‌ రూ. 175, స్కిన్‌ లెస్‌ రూ. 200కి చేరింది. అవే ధరలు నేటి వరకు కొనసాగుతున్నాయి.ఇటీవల చికెన్ ధరలు పెరుగుతున్నాయి. గత నెలలో రూ.170 నుంచి రూ.180 వరకు ఉన్న చికెన్ ధర ఇప్పుడు రూ.220 వరకు ఎగబాకింది. ఇందుకు కోళ్ల దాణా ధరలు పెరగడం కూడా ప్రధాన కారణం. కోళ్లకు మొక్కజొన్న, తౌడు, నూకలు, సోయాబిన్ వంటి వాటిని దాణాగా ఉపయోగిస్తారు. వీటి ధరలు గత ఏడాది కాలంలో భారీగా పెరిగాయి. దీంతో చికెన్ ధరలు కూడా పెరుగుతున్నాయి.అక్టోబర్ నెలలో దసరా పండుగ సమయంలో హైదరాబాదులో కిలో చికెన్ ధర రూ.180 వరకు ఉంది. ఇప్పుడు ఇది రూ.220 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇంతకంటే ఎక్కువ ధర కూడా పలుకుతోంది. ఏడాది కాలంలో దాణా విషయానికి వస్తే కిలో మొక్క జొన్న ధర రెండింతలు, సోయాబిన్ ధర దాదాపు రూ.7, నూకలు దాదాపు రెండింతలు, తౌడు దాదాపు రెండింతలు పెరిగింది. ఈ ప్రభావం చికెన్ ధరలపై పడింది.పెరిగిన దాణా ధరల నేపథ్యంలో ఒక్కో కోడికి అయ్యే మేత ఖర్చు దాదాపు రెండింతలు అవుతోంది. అంతేకాదు, చాలామంది రైతులు కోళ్ల పెంపకం నుంచి తప్పుకున్నారు. చికెన్ ధరలు పెరగడానికి ఇది కూడా ఓ కారణంగా భావిస్తున్నారు.